Telusu kada Ott: తెలుసు కదా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ అంటే..

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:25 AM

సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన చిత్రం ‘తెలుసు కదా’ . ఈ  రొమాంటిక్‌ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు  సిద్ధమైంది.

సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన ఈ సినిమాతోనే దర్శకురాలిగా పరిచయం అయ్యారు. టిజి విశ్వ ప్రసాద్ నిర్మాత. దీపావళి సందర్భంగా బాక్సాఫీసు వద్ద పోటీ పడిన చిత్రాల్లో ఇది ఒకటి.  ఈ  రొమాంటిక్‌ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు  సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది. 

Story:

వరుణ్‌ (సిద్ధు జొన్నలగడ్డ) ఓ అనాధ. అతని స్నేహితుడు అభి (వైవా హర్ష). ఇద్దరూ చిన్నప్పుటి నుంచి కలిసే పెరుగుతారు. మొదటి నుండి తనకంటూ ఓ సొంత కుటుంబం ఉండాలని కలలుకంటూ ఉంటాడు సిద్ధు. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఓ బ్రేకప్ తర్వాత బుద్థిగా అంజలి (రాశీఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు వరుణ్. పెళ్ళి అయిన కొన్ని నెలలకే అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. దాంతో సరోగసీ ద్వారా పిల్లలను కనాలని అనుకుంటారు. అందుకోసం రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) అనే డాక్టర్ ముందు కొస్తుంది. వరుణ్, అంజలికి తాను సరోగసీ ద్వారా బిడ్డ కంటానని చెబుతుంది. అందుకు వరుణ్ అంగీకరించాడా? వరుణ్ కూ రాగాకు ముందే పరిచయం ఉందా? ఆ పరిచయాన్ని ఎందుకు వీళ్ళిద్దరూ అంజలి దగ్గర దాచి పెట్టారు? దాని పర్యవసానం ఏమిటీ? అనేది మిగతా కథ.

Updated Date - Nov 09 , 2025 | 12:35 PM