Odela2: శోభనం రోజే అమ్మాయిలను చంపేసే ప్రేతాత్మ! 20 రోజులకే ఓటీటీకి.. తమన్నా సూపర్ నాచురల్ థ్రిల్లర్!
ABN, Publish Date - May 07 , 2025 | 09:25 PM
గత నెలలో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం ఓదెల2 ఇప్పుడీ సినిమా కేవలం 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
గత నెలలో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం ఓదెల2 (Odela 2). తమన్నా (Tamannaah Bhatia) కథానాయకురాలిగా లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా ఏప్రిల్17న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా కేవలం 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ డైరెక్టర్ సంపంత్ నంది (Sampath Nandi) ఈ సినిమాను నిర్మించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా అశోక్ తేజ (Ashok Teja)దర్శకత్వం వహించాడు. కన్నడ నటుడు కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహా (Vasishta N Simha) ప్రతినాయకుడిగా నటించగా హెబ్బా పటేల్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు చేశారు. అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందించాడు.
కథ విషయానికి వస్తే.. ఓదెల పార్ట్1 సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే రెండవ భాగం మొదలవుతుంది. చనిపోయిన తిరుపతి ఆత్మకు శాంతి కూడా ఉండకూడదని ఊరంతా కలిసి శవ సమాధి చేయిస్తారు. కొన్నాళ్లకు ప్రేతాత్మక మారిన తిరుపతి ఊరి ప్రజలపై పగ బడతాడు. కొత్తగా శోభనం చేసుకునే అమ్మాయిలను చంపేస్తూ ఉంటుంది. దీంతో భయాందోళనలకు గురైన ఆ గ్రామ ప్రజలు ఈ సమస్య నుంచి బయట పడడానికి ఆ ఊరి నుంచి ఎప్పుడో వెళ్లిపోయిన ఓ నాగసాధువు భైరవిని తీసుకు వస్తారు. ఈ నేపథ్యంలో భైరవి ఆ ఊరిని ఎలా కాపాడింది, ఎంతో బలం కలిగి ఉన్న తిరుపతి ప్రేత్మాత్మతో ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంది, చివరలో ఎవరు సాయమందించారనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా ముగుస్తుంది.
ఊరుని పట్టి పీడిస్తున్న ప్రేతాత్మను దైవాంశ అండతో ఓ నాగసాధువు ఎలా కాపాడిందన్న నేపథ్యంలో సాగే ఈ సినిమా మే8 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవనుంది. అయితే చాలా సందర్భాల్లో మితిమీరిన హింస, కొన్ని అశ్లీల సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టిన తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. భైరవి, ప్రేతాత్మల మధ్య సన్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. థియేటర్లలో మిస్సయిన వారు ఇంటిపట్టునే ఈ ఓదెల2 (Odela 2) చూసేయవచ్చు. అయితే పిల్లలతో చూడాలనుకునే వారు కొన్ని సన్నివేశాల విషయంలో చాలా జాగ్రత్త వహించడం బెటర్.