Superman OTT: సడన్‌గా ఓటీటీకి.. వచ్చేసిన సూపర్‌మ్యాన్
ABN , Publish Date - Aug 20 , 2025 | 08:10 AM
హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్ (Superman) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి వీక్షకులకు సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చింది.
గత నెల జూలై11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి అలరించిన హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్ (Superman) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ (digital premiere,)కు వచ్చి వీక్షకులకు సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా నటించిన ఈ సినిమాకు సూసైడ్ స్క్వౌడ్, గార్డయన్స్ ఆఫ్ ది గెలాక్సీల చిత్రాల డైరెక్టర్ జేమ్స్ గన్ (James Gunn) గత సినిమాలకు భిన్నంగా సరికొత్త మూవీగా, సిరీస్‌గా స్టార్ట్ చేశాడు. సుమారు రూ1900 కోట్ల బ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ. 5వేల కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది హాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాల్లో టాప్ 10లో స్థానం సంపాదించుకుంది.
కథ విషయానికి వస్తే.. బొరావియా అనే దేశం పక్కనే ఉండే జర్హాన్‌పూర్‌పై దాడి చేయకుండా సూపర్‌మ్యాన్ ఆపేస్తాడు. కానీ అక్కడి “హ్యామర్ ఆఫ్ బొరావియా” అనే మెటాహ్యూమన్ చేతిలో ఓడిపోతాడు. ఆపై తన పెంపుడు కుక్క క్రిప్టో సహాయంతో ఫోర్ట్రెస్‌కి వెళ్లి కోలుకుంటాడు. ఈ క్రమంలో హ్యామర్ అసలు లూథర్ సృష్టించిన అల్ట్రామ్యాన్ అని తెలుస్తుంది. అయితే లూథర్ సూపర్ మ్యాన్ తండ్రి క్రిప్టాన్ పంపిన ఓ మేసేజ్‌ను మరో రకంగా ప్రజల ముందుకు తీసుకు వచ్చి సూపర్‌మ్యాన్‌ను ప్రపంచాన్ని కాపడడానికి కాదని, జయించమని చెప్పి ఇక్కడకు పంపిచినట్లు ప్రజలకు తెలిసేలా చేస్తాడు. దీంతో సర్వత్రా సూపర్ మ్యాన్ పై వ్యతిరేకత వచ్చి అంతా ప్రజలు అనుమానించడం మొదలవుతుంది. అదే సమయంలో.. లూథర్ కొత్తగా సృష్టించిన పాకెట్ యూనివర్స్‌లో సూపర్‌మ్యాన్‌ను బంధిస్తాడు.
ఈ క్రమంలో సూపర్ మ్యాన్ అంత కఠినమైన ప్రాంతం నుంచి ఏ విధంగా బయట పడ్డాడు, పోయున తన శక్తులను ఎలా పొందాడు, లూథర్ కుయిక్తులను ఏ రకంగా ఎదుర్కొన్నాడు, అసలు తన తండ్రి పంపిన మెసేజ్‌లో ఏముందనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఈ నేపథ్యంలో తన లాగే ఉండి తన కన్నా డబుల్ పవర్స్ ఉన్న అల్ట్రామ్యాన్, ఇంజనీర్‌లతో పోరాట సన్నివేశాలు వాహ్ వా అనిపిప్తాయి.
నువ్వు చేసే చేతలు, నీ చేతుల్లోనే ఉంటాయి, వాటి వల్లే నువ్వు ఎవరో ఈ లోకానికి తెలుస్తుంది అనే కాన్పెస్ట్ ఆధారంగా ఈ సినిమా సాగుతూ ఎక్కడా ఉలాంటి అభ్యంతరకర సన్నివేశాలు చివరి వరకు కూర్చోబెడతాయి. ఇప్పుడీ సూపర్‌మ్యాన్ (Superman) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video ), యాపిల్ ఫ్లస్ (Apple TV+) ఓటీటీ (OTT)ల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి ఇతర దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరున ఇండియాలో స్ట్రీమింగ్‌కు రానుండగా ఇప్పటికే ఫ్రీ వెబ్‌సైట్లలో ఉంది.