Jaat OTT: ఓటీటీకి తెలుగులోనూ.. సన్నీడియోల్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ జాట్! ఎప్పటినుంచంటే?
ABN , Publish Date - Jun 03 , 2025 | 09:36 AM
స్టార్ హీరో సన్నీ డియోల్ కథానాయకుడిగా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన చిత్రం జాట్.
స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) కథానాయకుడిగా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన చిత్రం జాట్. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవినీ నిర్మించగా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. హిందీ సినిమా అయినప్పటికీ పూర్తిగా తెలుగు ప్రాంతం నేపథ్యంలో ఇక్కడే పూర్తి షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం సౌత్ మాస్ రేంజ్‌ను బాలీవుడ్ తెరకు రుచి చూపించింది. రణదీప్ హుడా (Randeep Hooda) ప్రతినాయకుడిగా నటించగా రెజీనా (Regina Cassandra), సయామి ఖేర్ (Saiyami Kher), వినీత్ ఉమార్ సింగ్ (Vineet Kumar Singh), జగపతి బాబు, రమ్మకృష్ణ, బిగ్‌బాస్ దివి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సుమారు 55 రోజుల తర్వాత ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. తుంగ రాణా, అతని సోదరుడు ఏపీలోని మోటుపల్లి దాని పరిసర గ్రామాలను తమ ఆదీనంలో ఉంచుకుని నియంతలా వ్యవరిహిస్తుంటాడు. అలాంటి సమయంలోనే.. బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ వెళ్తున్న రైలు ఇంజన్ సమస్యతో ఆ ఊరి సమీపంలో ఆగిపోతుంది. దీంతో దగ్గర్లో ఉన్న హోటల్కు వెళ్లి టిఫిన్ చేస్తుండగా లోకల్ రౌడీలు హోటల్ పై దౌర్జన్యం చేసే క్రమంలో హీరోను డిస్ట్రబ్ చేస్తారు. దీంతో కోపొద్రిక్తుడైన బ్రిగేడియర్ అక్కడి రౌడీల నుంచి మొదలు పెట్టి ఎదురొచ్చిన ప్రతొక్కడి అంతు చూసుకుంటూ వెళతాడు. ఆపై విలన్ తుంగ రానా ఎదురు పడడం, అదే సమయంలో ఆ గ్రామంలో జరుగుతన్న అకృత్యాల గురించి హీరోకు తెలియడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఇంతకు ఆ ఊర్లో ఉన్న సమస్యయ ఏంటి, హీరో వారికి ఎలా అండగా నిలిచాడనేదే సింపుల్‌గా ఈ మూవీ కథ.
సౌత్ సినిమాల స్టైల్‌లో పూర్తి ఔట్ అంట్ ఔట్ మాస్ మసాలా కాన్సెప్ట్‌తో, కేజీఎఫ్ స్టైల్ ఎలివేషన్లతో సినిమా సాగుతూ యాక్షన్ ప్రియులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. సెకండాఫ్‌లో ఎమోషన్ ఎక్కువైనప్పటికీ డైలాగులు, యాక్షన్ సీన్లు వాటిని మైమరిపిస్తాయి. తమన్ సంగీతం బావుంటుంది. ముఖ్యంగా హీరో, విలన్ సన్నివేశాలు విజిల్స్ వేపించేలా ఉంటూ చూసే వారికి మంచి హై ఇస్తాయి. ఈ సినిమా జూన్6 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుండగా తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. థియేటర్లలో చూడని వారు, యాక్షన్ చిత్రాలు ఇష్టపడే వారు ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.