Gangers OTT: సడన్‌గా తెలుగులో ఓటీటీకి వచ్చిన.. వడివేలు లేటెస్ట్ యాక్షన్, కామెడీ
ABN , Publish Date - May 15 , 2025 | 10:24 PM
గత నెలాఖరున తమిళనాట థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం గ్యాంగర్స్ సడన్‌గా తెలుగులో ఓటీటీకి వచ్చింది.
గత నెలాఖరున తమిళనాట థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం గ్యాంగర్స్ (Gangers). హర్రర్ చిత్రాల నిపుణుడు, దర్శక నటుడు, ఖుష్బూ భర్త సుందర్ సి (Sundar C), వడివేలు (Vadivelu) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేఓకుల ముందుకు వచ్చి కేవలం మూడు వారాల్లోనే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది అందరినీ అశ్చర్య పరిచింది. కేథరిన్ థెరిసా (Catherine Tresa), వాణి భోజన్ (Vani Bhojan) కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఇటీవల బాక్, మదగజరాజా వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సుందర్ సీనే రచించి, దర్శకత్వం వహించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. ఓ పాఠశాలలో పదహారేండ్ల బాలిక కనబడకుండా పోవడంతో ఆ బాలిక తల్లి పాప చదివే స్కూల్ టీచర్‌కు ఫిర్యాదు చేస్తుంది. దీంతో టీచర్ పోలీస్ కమిషనర్‌కు ఈ మెయిల్ చేయడంతో ఓ ప్రత్యే అధికారిని నియమిస్తారు. అదే సమంయలో ఆ స్కూల్‌కు ఓ కొత్త పీఈటీ శరవణన్ జాయిన్ అవుతాడు. ఆయన మరో పీఈటీ సింగారం, టీచర్ సుజితతో కలిసి ఆ అమ్మాయి కేసును పరిశోధించే పనిలో పడతారు. ఈ క్రమంలో మధ్యలో మనీ హైస్ట్ వ్యవహారం రావడంతో సినిమా టర్న్ తీసుకుంటుంది. ఆపై అమ్మాయిని ఎలా కనిపెట్టారు, అసలు వీటి వెనకాల ఉన్న గ్యాంగ్, వారి కథేంటి అనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.
లాజిక్ లెస్ కామెడీ సీన్లు, కాస్త అరవ పైత్యంతో సాగే ఈ సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివి ఉండగా ఫస్టాఫ్ అంతా మనం ఐహించిందే జరుగుతూ ఉంటుంది. సెకండాఫ్‌లో మనీ హైస్ట్ సీన్ ప్రారంభమయ్యాక కథ అనేక మలుపులు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అనేక లాజిక్ లెస్ సన్నివేశాలు వచ్చినా వడివేలు సింగిల్ హ్యాండ్‌తో సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై మోసాడనడంలో అతిశయోక్తి లేదు. మరీ అంతా కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు లేకున్నా ఎక్కడా బోర్ ఫీలవుకుండా స్క్రీన్‌ప్లే ఉండడం ఉపశమనం కలిగించే అంశం. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ ఈవుతుంది. ఆసక్తి ఉన్నవారు ఒక్కసారైతే చూడవచ్చు. ఓ ఐటమ్ సాంగ్‌లో హీరోయిన్ డ్రెస్‌లు తప్పితే మిగతా గ్యాంగర్స్ (Gangers సినిమాను కుటుంబంతో కలిసి చూసేయవచ్చు.