Our Fault OTT: ఓటీటీలో అదిరిపోయే రొమాంటిక్ డ్రామా.. కుర్రాళ్ల‌కు పండ‌గే

ABN , Publish Date - Oct 16 , 2025 | 09:47 PM

ఓటీటీ ప్రియుల‌ను ముఖ్యంగా యంగ్ ఆడ‌ల్ట్ వీక్ష‌కుల‌ను అల‌రించేందుకు తాజాగా ఓ స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Our Fault

ఓటీటీ ప్రియుల‌ను ముఖ్యంగా యంగ్ ఆడ‌ల్ట్ వీక్ష‌కుల‌ను అల‌రించేందుకు తాజాగా ఓ స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మొత్తం మూడు సినిమాల సిరీస్‌లో ఇప్ప‌టికే 2023లో మై ఫాల్ట్ (My Fault), 2024లో యువ‌ర్ ఫాల్ట్ (Your Fault) సినిమాలు స్ట్రీమింగ్‌కు రాగా 2025లో ఇప్పుడు అవ‌ర్ ఫాల్ట్ (Our Fault) స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. స్పానిష్ క‌వ‌యిత్రి మెర్సిడెజ్ రాన్ లెఫెజ్ ర‌చించిన క్ల‌ప్ మియా బుక్ ఆధారంగా ఈ సినిమాలు రూపొందించారు. నికోల్ వాలెస్ (Nicole Wallace) గాబ్రియేల్ గువేవరా (Gabriel Guevara) లీడ్ రోల్స్‌లో న‌టించ‌గా డొమింగో గోన్జాలెజ్ (Domingo González) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. తండ్రికి దూరంగా త‌ల్లితో ఉంటున్న నోవా త‌న త‌ల్లి మ‌ర‌ణానంత‌రం త‌న తండ్రి వ‌ద్ద ఉండేందుకు వెళుతుంది. అక్క‌డ త‌న స్టెప్ బ్ర‌ద‌ర్ నిక్‌ను క‌లుస్తుంది. మొద‌ట ఇరువురు గొడ‌వ‌లతో గ‌డిపిన వారు త‌ర్వాత స్నేహితులుగా మారి ఆపై ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని విధంగా ప్రేమ‌లో మునిగి పోతారు. అక్క‌డితో మొద‌టి పార్ట్ మై ఫాల్ట్ (My Fault)లో ముగియ‌గా రెండో పార్టులో వారిరువురు త‌మ ప్రేమ వ్యవ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టి పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌య‌త్న చేస్తారు. ఈ క్ర‌మంలో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ ఒత్తిడితో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త ఎడ‌బాటు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో నోవా మ‌రొక‌రితో రిలేష‌న్‌లోకి వెళ్ల‌డంతో యువ‌ర్ ఫాల్ట్ (Your Fault) సినిమా ముగుస్తుంది.

Our Fault

ఇక తాజాగా స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన అవ‌ర్ ఫాల్ట్ (Our Fault) సినిమాకు వ‌చ్చేస‌రికి..పెళ్లి చేసుకోలేక వేరు ప‌డిన నిక్ నోవా జంట నాలుగేండ్ల త‌ర్వాత తిరిగి క‌లుసుకుంటారు. అప్ప‌టికే వారికి వేర్వేరు వ్య‌క్తుల‌తో రిలేష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ వారి మ‌ధ్య ప్రేమ మ‌ళ్లీ చిగురిస్తుంది. ఈ నేప‌థ్యంలో వారు తిరిగి క‌లిశారా లేదా, నోవా ద‌గ్గ‌ర ఉన్న అబ్బాయి ఎవ‌రు అనే క‌థ‌తో సినిమాను ముగించారు. సినిమాలో చాలా సంద‌ర్భాల్లో వ‌చ్చే లొకేష‌న్స్‌, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అల‌రిస్తాయి. అంతేగాక ముఖ్యంగా హీరోహీరోయిన్ల జంట ముగ్ద మ‌నోహ‌రంగా ఉండి వీక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టి ప‌డేస్తారు.

అయితే వారు న‌డిపే సంబంధాలు మ‌న సంస్కృతికి విరుద్దంగా ఉండి కాస్త షాకింగ్‌గా ఉంటాయి. రొమాంటిక్‌, స‌న్నివేశాలు మోతాదుకి మించే ఉంటాయి. కేవ‌లం ఈ సినిమా పెద్ద‌ల‌కు మాత్ర‌మే. పిల్లలు, ఫ్యామిలీస్‌ను ఎంత దూరం ఉంచితే అంత మంచిది. కుర్ర‌కారుకు మంచి టైం ఫాస్ మూవీ. ఇప్పుడు ఈ సినిమా మూడు భాగాలు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో ఇంగ్లీష్‌, స్పానిష్‌తో పాటు తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది. సో మంచి రొమాంటిక్‌, మ‌సాలా సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమాల సిరీస్ ఫుల్ మీల్స్ పెడుతుంది.

Updated Date - Oct 16 , 2025 | 09:47 PM