Madharaasi OTT: ఓటీటీకి ‘మదరాసి’.. ఇక్క‌డైనా చూస్తారా

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:54 PM

సెప్టెంబ‌ర్‌5న‌ పాన్ ఇండియా చిత్రంగా వ‌చ్చి ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక పోయిన త‌మిళ సినిమా ‘మదరాసి’.

Madharaasi

ఈ నెల మొద‌టి వారంలో సెప్టెంబ‌ర్‌5న‌ పాన్ ఇండియా చిత్రంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకుని ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక పోయిన త‌మిళ సినిమా ‘మదరాసి’ (Madharaasi). ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో శివ కార్తికేయ‌న్ (Siva Karthikeyan), రుక్మిణీ (Rukmini) జంట‌గా న‌టించారు. యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్ మెంట్ జాన‌ర్‌లో వ‌చ్చిన‌ ఈ చిత్రం ఇప్పుడు నెల కూడా తిర‌గ‌కుండానే డిజిటల్ ప్లాట్‌ఫామ్ (OTT ) లోకి వ‌చ్చేస్తోంది.

కథ విష‌యానికి వ‌స్తే.. ఉత్త‌ర భార‌త‌దేశం నుంచి తమిళనాడులోకి అక్రమ ఆయుధాలను రవాణా చేయాలనుకునే సిండికేట్‌ను అడ్డుకోవడమే కథ. ఈ మిషన్‌లో అనుకోకుండా రఘురామ్‌ (శివకార్తికేయన్) అనే వ్యక్తి చేరడం, ఆపై ద‌శాబ్దానికి పైగా అతనికి ఉన్న‌ మానసిక సమస్య, ప్రేమికురాలు మాలతి (రుక్మిణీ వసంత్ సైతం ఇందులో చిక్కుకొవ‌డం, ఆ త‌ర్వాతి పరిస్థితులు ఎలా మలుపుతిప్పాయి? రఘుకు ఉన్న మానసిక సమస్య ఏమిటీ? దాని ద్వారా ఎన్.ఐ.ఎ. అధికారులు ఎలా లబ్దిపొందారు? విలన్స్ ఉచ్చులో చిక్కుకున్న మాలతి అందులోంచి ప్రాణాలతో బయటపడిందా? అనేది సినిమా కథ.

Madharaasi

కాస్త లాజిక్‌ల‌కు దూరంగా అంతా రోటీన్ క‌థాంశంతో ఎలాంటి కొత్త‌ద‌నం లేకుండా సినిమా సాగడంతో తెలుగు నాట అంత ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. త‌మిళంతో ఓ మోస్త‌రుగా ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. ప్ర‌తి నాయ‌కులు విద్యుత్ జమ్వాల్, షబీర్ తెరపై స్టైలిష్ గా కనిపించారు. శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ తమ నటనతో ఈ సినిమాను కాస్తంత నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఆక్టోబ‌ర్ 1నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. థియేటర్‌లో మిస్స‌యిన వారు, ముర‌గ‌దాస్‌, శివ కార్తికేయ‌న్ ఫ్యాన్స్ ఒక్క‌సారి సినిమాను చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Sep 28 , 2025 | 02:05 PM