Jack OTT: ఆ.. ఓటీటీకి వచ్చేసిన ‘జాక్’ .. ఇక్కడైనా జనం చూస్తారా?
ABN , Publish Date - May 08 , 2025 | 08:22 AM
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, చైతన్య జంటగా నటించిన చిత్రం జాక్. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చింది. ఇప్పుడు ఓటీటీకి సైతం వచ్చేసింది.
గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన చిత్రం జాక్ (Jack). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కథకథనాలు లోపించి ఆడియెన్స్‌ను మెప్పించలేక పోయింది. రూ. 30కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ రూ.5,6 కోట్లను మించి కలెక్షన్లు తీసుకురాలేక అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచింది. అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) రచన, దర్శకత్వం చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (Sri Venkateswara Cine Chitra) బ్యానర్‌పై B. V. S. N. ప్రసాద్ (B. V. S. N. Prasad,) నిర్మించారు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj), సీనియర్ నరేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ సినిమా నెల రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. హీరో పాబ్లో నెరూడా (సిద్ధు జొన్నలగడ్డ) తన తల్లి ఎప్పుడు చెప్పినట్లు అంతా గర్వపడే స్థాయికి చేరుకుంటానని అనుకుంటుంటాడు. ఈ క్రమంలో అనేక రకాల పనులు చేస్తూ వేటిలోనూ ఇమడ లేక మధ్యలోనే ఆపి వస్తుంటాడు. తన తల్లి మరణానికి కారణమైన టెర్రరిస్టుల అంతు చూడాలి, దేశానికి సేవ చేయాలని ఎలాగైనా ఇండియన్ రాలో చేరాలని అనుకుంటాడు. కానీ అతని హైపర్ నెస్ వళ్ల అక్కడ ఛాన్స్ తెచ్చుకోలేక పోతాడు. అయినా తనే స్వయంగా రంగంలోకి దిగి టెర్రరిస్టులను అంతమొందించడానికి ప్రయత్నాలు చేస్తూ అలాగైనా తన పనిని చూసి రా తనను గుర్తిస్తుందనే భావనలో ఉంటుంటాడు.సరిగ్గా అదే సమయంలో కొంతమంది తీవ్రవాదులు భారత్ లోకి అత్యాధునిక ఆయుధాలతో చొరబడి పేలుళ్ళకు కుట్రలు చేస్తున్నారనే విషయం 'రా' అధికారి మనోజ్ (ప్రకాశ్ రాజ్)కు తెలుస్తుంది. దీంతో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయాలని అతని బృందం హంటింగ్ మొదలు పెడుతుంది.
మరోవైపు అటు పాబ్లోకూడా ఇదే విషయంపై వేట మొదలు పెట్టడంతో సమస్య జటిలమవుతుంది. రా టీమ్‌కు కొత్త సమస్యలు వచ్చి పడుతుంటాయి. జాక్ వళ్ల 'రా' టీమ్ ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? చివరకి టెర్రరిస్టుల అటాక్ నుంచి దేశాన్ని ఎలా కాపాడారు? అనేదే 'జాక్' కథ.బొమ్మరిల్లు, ఆరెంజ్, వంటి సెన్పిబుల్ చిత్రాల డైరెక్టర్ భాస్కర్ నుంచి వస్తున్న చిత్రం అవడం, డిజే టిల్లు, టిల్లు2 వరుస విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం అవడంతో ఈ జాక్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథనంలో గజిబిజితో ప్రజల ఆదరణను దక్కించుకోలేక సిద్ధు కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఈ రోజు (గురువారం మే8) నుంచి నెట్‌ఫ్లిక్స్ (netflix) ఓటీటీ వేదికగా తెలుగుతో పాటు హిందీ ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆసక్తి ఉన్న వారు చూడవచ్చు. తప్పనిసరైతే కాదు