Final Destination 6: సడన్‌గా ఓటీటీకి.. ప్రపంచాన్ని షేక్ చేసిన సినిమా! గుండె జబ్బులుంటే చూడొద్దు
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:52 PM
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ప్రపంచాన్ని షేక్ చేసిన హాలీవుడ్ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్.
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ప్రపంచాన్ని షేక్ చేసిన హాలీవుడ్ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ (Final Destination: Blood lines) నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో మొదలుకుని ప్రతి మూడేండ్లకో పార్ట్ చొప్పున 2003, 2006, 2009, 2011 వరకు మొతంగా 5 భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఒకదాన్ని మించి మరోటి సంచలన విజయాలు సాధించాయి. ఈక్రమంలో మళ్లీ పద్నాలుగేండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా గత నెల మే 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించి మేకర్స్‌ను సైతం ఆశ్చర్య పరిచింది.
కథ విషయానికి వస్తే.. పాత సినిమాల లాగానే మన ప్రమేయం లేకుండానే ఎక్కడో వెంటుక్ర వాసిలో జరిగిన ఓ చిన్న పొరపాటుతో హఠాత్తుగా అక్కడ ఉన్న మనిషికి ఊహకందని విధంగా, ఒళ్లు గగుర్పొడిచేలా మరణాలు సంభవించడం నేపథ్యంలోనే ఈ చిత్రం సాగుతుంది. ముందు వచ్చిన ఐదు చిత్రాలకంటే ఇందులో వయొలెన్స్, హారర్, థ్రిలింగ్ ఎలిమెంట్స్ సైతం ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా మంచి స్టోరీతో పాటు, సినిమా ఆరంభంలో వచ్చే స్కై స్కాపర్ సన్నివేశాలు జలదరింప జేస్తాయి. 1968లో ఓ స్కై వ్యూ హోటల్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (గాబ్రియల్ రోస్). కానీ.. ఓ ఒక్కరు చావు నుంచి తప్పించుకోవడం కుదరదు కాబట్టి అక్కడ చావు నుంచి తప్పించుకుని బ్రతికినవాళ్లందరినీ ఒక్కొక్కరిగా రకరకాల రీతుల్లో వాళ్లతో పాటు వాకి కుటుంబాలను సైతం ఘోరంగా బలి తీసుకుంటుంది.
ఈ క్రమంలో ఐరిస్ తిరిగి ఎవరినైనా కాపాడగలిగిందా, తన ఫ్యామిలీని రక్షించిందా లేదా అనే పాయింట్‌తో ఈ సినిమా ముగుస్తుంది. సుమారు 50 మిలిమన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల డాలర్ల వరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దుమ్మును దులిపింది. కైట్లిన్ శాంటా జువానా (Kaitlyn Santa Juana), టీయో బ్రియోన్స్ (Teo Briones), రిచర్డ్ హార్మోన్ (Richard Harmon), ఓవెన్ పాట్రిక్ జాయ్నర్ (Owen Patrick Joyner), అన్నా లోర్ (Anna Lore), బ్రెక్ బాసింగర్ (Brec Bassinger), టోనీ టాడ్ (Tony Todd) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా జాక్ లిపోవ్స్కీ (Zach Lipovsky), ఆడమ్ స్టెయిన్ (Adam Stein) ద్వయం దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ (Warner Bros. Pictures) విడుదల చేసింది.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video), యాపిల్ (Apple TV+) ఓటీటీల్లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా మన భారతదేశంలో అందుబాటులోకి రాలేదు. మరో వారం రోజుల్లో ఇక్కడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని థర్డ్ పార్టీ ఫ్రీ వెబ్ సైట్లలో ఇండియాలోనూ అవలెబుల్‌గా ఉంది. హింసాత్మక, థ్రిల్, స్లాషర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం ఫుల్ మీల్స్ వంటిది. కొత్త వాళ్లు చూడాలనుకుంటే కాస్త ధైర్యం చేయగలగాలి, ఆ సన్నివేశాలను చూసి తట్టుకోగలిగిన వారే ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ (Final Destination: Blood lines) మూవీని చూడాలి. గుండె సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండడం ఉత్తమం.