The 100 OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చేసిన అదిరిపోయే లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 07:13 AM

‘మొగలి రేకులు’ సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా చేరువైన ఆర్కే సాగర్ హీరోగా న‌టించిన క్రైమ్, ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ది 100.

The100 Movie

‘మొగలి రేకులు’ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైన ఆర్కే సాగర్ (RK Sagar) హీరోగా ఇటీవ‌ల న‌టించిన క్రైమ్, ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ది 100 (The 100). ఇప్ప‌టికే మాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌, సిద్థార్థ, షాదీ ముబారక్ అంటూ మూడు సినిమాలు చేసిన ఆయ‌న నాలుగో ప్ర‌య‌త్నంగా కాస్త విరామం తీసుకుని ఈ మూవీ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్ (Raghav Omkar Sasidhar) ఈ చిత్రాన్ని రూపొందించ‌గా రమేష్‌ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మించారు. మిషా న‌రాంగ్ క‌థానాయిక‌గా న‌టించ‌గా ధ‌న్య బాలృష్ణ‌న్, విష్ణుప్రియ‌, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు ఎలాంటి హాడావుడి లేకుండా స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. విక్రాంత్ (ఆర్కే సాగర్‌).. అప్పుడే ఐపీఎస్‌ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఏసీపీగా చార్జ్ తీసుకుని వ‌చ్చీ రాగానే సిటీలో రాబరీ గ్యాంగ్‌ కేసును టేకప్‌ చేస్తాడు. అంతేగాక‌ తను ఇష్టపడిన యువతి ఆర్తి కూడా కూడా బాధితురాలని తెలుసుకుని కేసును మరింత సీరియస్‌గా తీసుకుంటాడు. విచారణలో అతనికి దిగ్బ్రాంతిని క‌లిగించే విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. ఇంత‌కు ఆ నిజం ఏంటి? ఆ గ్యాంగ్‌ ఆర్తి కుటుంబాన్ని మాత్ర‌మే ఎందుకు టార్గెట్‌ చేసింది? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మధు (విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న నిజం ఏంటి? బిజినెస్‌మ్యాన్‌, వల్లభ (తారక్‌ పొన్నప్ప), విద్య (ధన్య బాలకృష్ణ) ఎవరు? అనేక చిక్కుముడులు ఉన్న ఈ కేసును విక్రాంత్‌ ఎలా పరిష్కరించాడనేది కథ.

The100 Movie.jfif

చాల‌మంది పేరు ఉన్న న‌టీన‌టులు న‌టించిన ఈ చిత్రం ఈరంభం నుంచే క‌థ‌లోకి తీసుకెళ్లి స‌ర్‌ఫ్రైజ్ చేస్తుంది. రాబరీ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం ఆపై వ‌చ్చే ట్విస్టు గూస్ బంప్స్ తీసుకు వ‌స్తాయి. ఆ గ్యాంగ్ గోల్డ్ మాత్ర‌మే ఎందుకు దొంగిలిస్తుంద‌నే విష‌యం వెనుక ఉన్న సీక్రెట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.ఆ గ్యాంగ్ ప‌ట్టుబ‌డిన అనంత‌రం వ‌చ్చే ట్విస్టు కూడా అదిరిపోతుంది. అంతేగాక చివ‌ర‌లో వ‌చ్చే సందేశం సైతం ఆక‌ట్టుకోవ‌డ‌మే కాక ఆలోచింప చేస్తుంది. ఇప్పుడీ ది 100 (The 100) చిత్రం ల‌య‌న్స్ గేట్ ప్లే (Lions Gate Play) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మంచి క్రైమ్‌, ఇన్వెస్టిగేష‌న్ సినిమాలంటే ఇష్ట‌ప‌డే వారు, థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఎంచ‌క్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - Aug 29 , 2025 | 07:13 AM