Kantara Chapter 1 OTT: ‘కాంతార చాప్టర్ 1’.. ఓటీటీకి వ‌చ్చేసింది! బెర్మే, క‌న‌క‌తార సిద్దంగా ఉన్నారు

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:43 AM

కన్నడ స్టార్ రిషబ్‌ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Kantara Chapter 1

కన్నడ స్టార్ రిషబ్‌ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘కాంతార’ 2022లో విడుదలై దక్షిణాదిని దాటి దేశమంతా సంచలనాన్ని సృష్టించింది. ఆ సినిమాతో రిషబ్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, ‘బెస్ట్ పాపులర్ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్’ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ విజయానంతరం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసింది దాని ప్రీక్వెల్ ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1).

హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో వచ్చిన ఈ ప్రీక్వెల్‌ దసరా సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై అద్భుతమైన రికార్డులు సృష్టించింది. గ‌త చిత్రాన్ని మించి రూ. 850 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. ఇప్పుడు నెల కూడా గ‌డ‌వ‌కుండానే ఎవ‌రూ ఉహించ‌ని విధంగా స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చి షాకిచ్చారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ‘కాంతార చాప్టర్ 1’ కథ 8వ శతాబ్దం నాటి కదంబుల కాలం నేపథ్యంగా ‘కాంతార’ సినిమాకి ముందు జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. శివ, అతని తండ్రి ఎక్కడైతే అడవిలో మాయమైపోతారో అక్కడే 'కాంతార' ప్రీక్వెల్ స్టార్ట్ అవుతుంది. అడవిలో దైవ శక్తుల నీడలో జీవించే గిరిజనుల కథ ఇది. ఆ దేవుని శిలపై దుష్ట శక్తుల దృష్టి పడటంతో ప్రారంభమయ్యే సంఘటనలు బెర్మే (రిషబ్‌ శెట్టి) అనే యువకుడిని ఎలా ప్రభావితం చేశాయి? అతడు దైవస్ఫూర్తితో దుష్ట శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు? ఇదే కథా సారాంశం.

Kantara Chapter 1

యువరాజు కులశేఖర్‌ (గుల్షన్‌ దేవయ్య) తన రాజ్య విస్తరణ కోసం దేవుని శిలను చేజిక్కించుకోవాలని తపనపడడం. అతనికి అడ్డుప‌డ్డ దైవ గ‌ణాలు, అక్క‌డి బెర్మే గిరిజనుల కోసం సాగించే యుద్ధం సినిమాకి ప్రాణం. మధ్యలో యువరాణి కనకావతి (రుక్మిణీ వసంత్‌)తో బెర్మే బంధం కథకు కొత్త మలుపున‌కు దారి తీస్తుంది.ఆపై ప‌డ‌మ‌టి మ‌నుషులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో కాంతార గిరిజ‌న ప్ర‌జ‌ల ఉనికి ప్ర‌మాదం ఎర్పుడుతుంది. దీంతో బెర్మే ఎలా వారితో పెరాడాడు, దైవ గ‌ణాలు ఎలా సాయ‌మందించాయ‌నేదే క‌థ‌.

సినిమా ప్రథమార్థం కొంచెం స్లోగా నడిచినా, ద్వితీయార్థం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌, ప్రీ-క్లైమాక్స్‌ సీన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కథాంశం, నిర్మాణ విలువలు, విజువల్స్‌, అజనీష్‌ లోక్‌నాథ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అన్నీ గ్రాండ్‌గా ఉన్నాయి. కానీ ‘కాంతార’లో ఉన్న ఎమోషనల్‌ కనెక్ట్‌ మాత్రం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే ఈ చిత్రం విడుద‌లై 4 వారాలు అవుతున్నా ఇప్ప‌టికీ దేశ‌మంత‌టా చాలా చోట్ల థియేట‌ర్ల‌లో హౌజ్‌ఫుల్ అవుతూ స్టిల్ రోజుకి కోటికి పైగానే క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది. అలాంటిది ఈ చిత్రాన్ని నెల‌ కూడా పూర్త‌వ‌కుండానే అప్పుడెప్పుడో మూడేండ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఓటీటీకి తీసుకు వ‌చ్చేశారు.

గురువారం అర్థ‌రాత్రి స‌రిగ్గా 12 గంట‌ల నుంచి (తెల్లారితే శుక్ర‌వారం)నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలో క‌న్న‌డ‌తో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులోకి తీసుకు వ‌చ్చారు. థియేట‌ర్ల‌లో చూడ‌డం మిస్స‌యిన వారు, మంచి సీట్ ఎడ్జ్ సినిమా చూడాల‌నుకునే వారికి ఇది మంచి అవ‌కాశం ఫ్యామిలీ అంతా ఇంటిప‌ట్టునే క‌లిసి ఈ కాంతార చాఫ్ట‌ర్1 (Kantara Chapter 1) సినిమాను త‌నివితీరా ఒక‌టికి రెండు సార్లు చూసి ఆస్వాదించ‌వ‌చ్చు.

Updated Date - Oct 31 , 2025 | 06:53 AM