Revolver rita : ఓటీటీలోకి కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్

ABN , Publish Date - Dec 21 , 2025 | 02:14 PM

కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించిన చిత్రం ‘రివాల్వర్‌ రీటా’ (Revolver Rita). క్రైమ్‌ కామెడీ నేపథ్యంతో జె.కె. చంద్రు దర్శకత్వం వహించిన చిత్రమిది.  నవంబరులో థియేటర్లలో విడుదలైంది. 

కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కథానాయికగా నటించిన చిత్రం ‘రివాల్వర్‌ రీటా’ (Revolver Rita). క్రైమ్‌ కామెడీ నేపథ్యంతో జె.కె. చంద్రు దర్శకత్వం వహించిన చిత్రమిది.  నవంబరులో థియేటర్లలో విడుదలైంది.  ఇప్పుడు  ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఈ నెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది. రాధికా శరత్‌కుమార్‌, సునీల్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథ: 

కర్మ రిటర్న్స్ అనే పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా 'రివాల్వర్ రీటా'. ఈ సినిమా కథ మొత్తం పాండిచ్చేరీ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి పాండిచ్చేరికి వెళ్ళిన జయసింహారెడ్డి తలను లోకల్ డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) నరికేస్తాడు. అండర్ వరల్డ్ తన ఆధిపత్యాన్ని తెలియచేస్తూ ఆ తలను అతని తమ్ముడు రెడ్డి (అజయ్ ఘోష్ Ajay Ghosh)కు పంపుతాడు. దాంతో పాండ్యన్ ఎలాగైనా చంపి తన పగ తీర్చుకోవాలని రెడ్డి సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇది జరిగిన పదిహేనేళ్ళకు పాండ్యన్ కొడుకు బాబీ (సునీల్ Sunil) అండర్ వరల్డ్ డాన్ గా మారతాడు. అదే సమయంలో అమ్మాయిల పిచ్చి ఉన్న పాండ్యన్... రెడ్డి వేసిన ట్రాప్ లో చిక్కి ప్రాణాలు కోల్పోతాడు. అయితే అతని ప్రాణాలు శత్రువుల చేతిలో కాకుండా రీటా (కీర్తి సురేష్‌) తల్లి చల్లమ్మ (రాధికా శరత్ కుమార్ Radhika Sarath Kumar) కారణంగా పోతాయి. వేశ్య ఇంటికి వెళ్ళబోయి పొరపాటున పాండ్యన్ వీళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ జరిగిన చిన్నపాటి గొడవలో అతను ప్రాణాలు కోల్పోతాడు. పాండిచ్చేరికే పెద్ద డాన్ అయిన పాండ్యన్ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక ఈ తల్లీ కూతుళ్ళు సతమతమౌతారు. ఈ క్రమంలో వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? పాండ్యన్ చనిపోయిన విషయం తెలిసి అతని కొడుకు బాబీ, శత్రువైన రెడ్డి, పోలీస్ ఆఫీసర్ కామరాజ్ ఎలా వీరిని ఛేజ్ చేశారు? అనేది మిగతా కథ.

Updated Date - Dec 21 , 2025 | 02:16 PM