Dragon: ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

ABN , Publish Date - Mar 08 , 2025 | 02:27 PM

‘లవ్‌ టుడే’ సినిమాతో తమిళ దర్శకుడు కమ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ చక్కని గుర్తింపును తెచ్చుకున్నాడు. కామెడీ రొమాంటిక్‌ చిత్రంతో తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


‘లవ్‌ టుడే’ సినిమాతో తమిళ దర్శకుడు కమ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) చక్కని గుర్తింపును తెచ్చుకున్నాడు. కామెడీ రొమాంటిక్‌ చిత్రంతో తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ (Return of the Dragon). ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో నడుస్తోంది. పక్కా యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు.

Ott.jpg

అశ్వత్‌ మారిముత్తు (Ashwath marimuttu) డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో కయాదు లోహర్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో (Netflix ott) సందడి చేయనుంది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ర్టీమింగ్‌ కానున్నట్లు  తెలిసింది.  

Updated Date - Mar 08 , 2025 | 02:27 PM