The Great Pre Wedding Show OTT: గ్రేట్ ఫొటోగ్రాఫర్.. ఓటీటీకి వచ్చేస్తున్నాడు.
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:33 PM
ఇటీవల చిన్న చిత్రంగా థియేటర్లకు వచ్చిమంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అందరి నుంచి ప్రశంసలు అందుకున్న చిత్రం ది గ్రేట్ ఇండియన్ ఫ్రీ వెడ్డింగ్ షో
ఇటీవల చిన్న చిత్రంగా థియేటర్లకు వచ్చిమంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అందరి నుంచి ప్రశంసలు అందుకున్న చిత్రం ది గ్రేట్ ఇండియన్ ఫ్రీ వెడ్డింగ్ షో (The Great Pre-Wedding Show). మసూద ఫేం తిరువీర్ (Thiruveer), టినా శ్రావ్య (Teena Sravya) జంటగా నటించగా నరేంద్ర రవి (Narendra Ravi), మాస్టర్ రోహన్ (Master Rohan), యామిని నాగేశ్వర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా కూడా ప్రకటించింది.
కథ విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలోని ఓ కుగ్రామంలో రమేశ్ (తిరువీర్) జీరాక్స్ సెంటర్, ఫొటో స్టూడియో నిర్వహిస్తూ ఉంటాడు. అదే గ్రామ సచివాలయంలో సెక్రటరీగా పని చేసే హేమ, రమేశ్ ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ బయట పడరు. సరిగ్గా అదే సమయంలో చిన్నపాటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి)కి, సౌందర్య (యామిని)తో పెళ్లి కుదురుతుంది. దీంతో తన పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే పని రమేశ్‌కు అప్పజెబుతాడు. అయితే ఫొటో షూట్ పూర్తి చేసిన రమేశ్ ఆ డేటా ఉన్న చిప్‌ను తన అసిస్టెంట్‌కు ఇవ్వగా అతను దానిని పోగొడతాడు.
దీంతో ఈ విషయం తెలిస్తే ఆనంద్ ఏమైనా చేస్తాడని భయపడ్డ రమేశ్ ఎలాగైనా ఆనంద్ పెళ్లిని చెడగొట్టాలని తన ప్రియురాలు హేమతో కలసి అనేక ప్రయత్నాలు చేస్తాడు. సరిగ్గా ఆ సమయంలోనే అనుకోకుండా ఆనంద్ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఈ క్రమంలో రమేశ్ తిరిగి పెళ్లి చేయాలనుకున్నాడు, ఈ నేపథ్యంలో ఎలాంటి పర్యవసనాలు ఎదురయ్యాయనే ఆసక్తికర వినోదాత్మక కథనంతో సినిమా సాగుతుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు మంచి నవ్వులు పంచుతారు. ఇప్పుడు ఈ చిత్రాం డిసెంబర్ 5 నుంచి జీ5 (Zee5) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవనుంది. ఫ్యామిలీ అంతా ఎంచక్కా ఇంటి పట్టునే ఉండి కలిసి చూస్తూ ఆస్వాదించవచ్చు.