The Girlfriend OTT: ఓటీటీకి వ‌చ్చేసిన.. 'ది గర్ల్ ఫ్రెండ్‌'! ట్రోలింగ్.. ఏ రేంజ్‌లో ఉంటుందో

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:39 AM

న‌వంబ‌ర్ మొద‌టి వారంలో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రసంశ‌ల‌తో పాటు ట్రోలింగ్‌కు గురైన చిత్రం ది 'ది గర్ల్ ఫ్రెండ్‌' ఓటీటీకి వ‌చ్చేసింది.

The Girlfriend

న‌వంబ‌ర్ మొద‌టి వారంలో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రసంశ‌ల‌తో పాటు ట్రోలింగ్కు గురైన చిత్రం ది 'ది గర్ల్ ఫ్రెండ్‌' (The Girlfriend. ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి విజ‌యం సాధించింది. అదే స‌మ‌యంలో చిత్ర ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు కాస్త మ‌రో ట‌ర్న్ తీసుకుని వ్య‌క్తిగ‌త ట్రోలింగ్‌, హిందూత్వం వంటి ఇష్యూల వైపు మ‌ళ్లీ ఆడియ‌న్స్ లో మంచి అటెన్ష‌న్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీకి వ‌చ్చేసింది.

The Girlfriend

క‌థ విష‌యానికి వ‌స్తే.. త‌ల్లి లేని, ఏ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌లేని భూమా అనే యువ‌తి ఉన్న‌త చ‌దువుల కోస‌మ‌ని వైజాగ్ నుంచి హైద్రాబాద్ వ‌చ్చి ఓ పీజీ (హాస్ట్‌ల్‌)లో దిగుతుంది. అక్క‌డ విక్ర‌మ్‌తో ఏర్ప‌డిన రిలేష‌న్ స్నేహం నుంచి ప్రేమ‌గా ఆపై శారీర‌క సంబంధం వ‌ర‌కు వెళుతుంది. అదే స‌మ‌యంలో విక్ర‌మ్‌తో ప్రేమ‌లో ఉన్న దుర్గ అనే అమ్మాయి భూమాతో ఫ్రెండ్‌షిప్ చేసి మీ ఇద్ద‌రికి సెట్ అవ‌ద‌ని దూరంగా ఉంటే బెట‌ర్ అన్న‌ట్లు చెబుతుంది. కొన్నాళ్ల‌కు విక్ర‌మ్ చూపించే అతి ప్రేమతో భూమా మాన‌సిక ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో త‌ను ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది, విక్ర‌మ్‌తో క‌లిసి ఉందా, విడిపోయిందా, ఆ ఫ్యామిలీతో ఎదురైన ఘ‌ట‌న‌లేంటి, తండ్రి ఏలా రియాక్ట్ అయ్యాడ‌నేదే క‌థ‌.

The Girlfriend

చెప్పుకోవ‌డానికి సింఫుల్ క‌థే, స్ట్రాంగ్ మేసేజ్‌ అయిన రాహుల్ ఈ సినిమాను న‌డిపించిన విధానం బోల్డ్‌గా, ఇల్లాజిక‌ల్‌గా ఉండి ప్రేక్ష‌కుల‌కు వెంట‌నే క‌నెక్ట్ అయ్యేలా ఉండ‌దు. హాస్టల్ సన్నివేశాలు కాస్త ఆడియ‌న్స్‌ను ఇబ్బంది పెడ‌తాయి. ఇప్పుడీ 'ది గర్ల్ ఫ్రెండ్‌' (The Girlfriend సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. రోహిణి, రావు ర‌మేశ్ పాత్ర‌లు కాస్త ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ర‌ష్మిక, రాహుల్ ర‌వింద్ర‌న్ ఫ్యాన్స్ ఒక‌మారు ఈ సినిమాను ట్రై చేయ‌వ‌చ్చు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూడ‌డం అంత కంఫ‌ర్ట్‌గా ఉండ‌దు.

Updated Date - Dec 05 , 2025 | 06:53 AM