Rana Naidu 2: ‘రానా నాయుడు2’. టీజ‌ర్ వ‌చ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచంటే?

ABN , Publish Date - May 21 , 2025 | 11:16 PM

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ 2 ట్రైల‌ర్ బుధ‌వారం రిలీజ్ చేశారు.

rana

విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana) నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. మొదటి సీజన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా  నెట్ ఫ్లిక్ ఓటీటీలో టాప్ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందింది. ఆ అద్భుతమైన స్పందనతో ప్ర‌స్తుతం రెండో సీజన్‌ (RANA NAIDU 2) ను అంతకు మించి అనేలా రూపొందించారు.

తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్ జూన్‌13 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొద‌టి భాగంలో మిస్స‌యిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఈ సీజ‌న్‌లో గ‌ట్టిగానే ద‌ట్టించిన‌ట్లు ట్ఐల‌ర్ చూస్తే తెలుస్తోంది.

Updated Date - May 21 , 2025 | 11:20 PM