Andhra King Taluka OTT: మీకు తెలుసా.. 'ఆంధ్రా కింగ్ తాలూకా ' ఓటీటీకి వచ్చేసింది
ABN , Publish Date - Dec 26 , 2025 | 08:05 AM
పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అశించినంత విజయం దక్కించుకోలేక పోయిన చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'.
గత నెలలో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ఎదుటకు వచ్చి అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అశించినంత విజయం దక్కించుకోలేక పోయిన చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా ' (Andhra King Taluka). రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse), ఉపేంద్ర (Upendra) కీలక పాత్రల్లో నటించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేశ్‌బాబు (Mahesh Babu) దర్శకత్వం వహించాడు. నవంబర్ 27న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచి టాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది.

కథ విషయానికి వస్తే.. చిన్ననాటి నుంచే సూర్య అనే సినిమా స్టార్ ఫ్యాన్ అయిన సాగర్ తాను చేసే ప్రతీ పనిలోనూ తన అభిమాన హీరో సినిమాల్లో చెప్పిన డైలాగులు, చేసిన పనులను ప్రేరణ పొందుతూ ఉంటాడు. అయితే తన హీరో సూర్య డౌన్‌ఫాల్ కావడం, 100వ చిత్రం విడుదలకు సైతం నోచుకోక ఇబ్బందులు పడుతున్న సమయంలో వీరాభిమాని అయిన సాగర్ తను ఓ కార్యం కోసం సంపాదించిన డబ్బు మొత్తాన్ని రహస్యంగా హీరో సినిమా రిలీజ్ చేసేందుకు సాయం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో తన అజ్ఞాత అభిమానిని కలుసుకునేందుకు స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తను ప్రయాణిస్తూ.. తన అభిమాని గురించిన విషయాలు ఒక్కోక్కటే తెలుసుకుంటూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో సూర్యకు తన అభిమాని గురించి తెలిసిన విషయాలేంటి, అతను తనకు అభిమానిగా ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కథకథనాలతో సినిఆ సాగుతుంది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, రామ్ అభిమానులు తప్పక చూడాల్సిన సినిమా. ఇంటర్వెల్ ముందు వచ్చే ఓ ముద్దు సన్నివేశం తప్పితే మూవీని అంతా కుటుంబంతో కలిసి చూసేయవచ్చు.