Coolie: ర‌జ‌నీకాంత్ కూలీ.. ఓటీటీకి వ‌చ్చేసింది

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:42 AM

ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఓ రోజు ముందే ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన చిత్రం కూలీ.

Coolie

ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఓ రోజు ముందే ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన చిత్రం కూలీ (Coolie). ర‌జ‌నీకాంత్ (Rajinikanth), లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) కాంబినేష‌న్‌లో చిత్రం కావ‌డంతో రిలీజ్‌కు ముందు నుంచే ఆకాశాన్నంటే అంచ‌నాల‌తో రిలీజ్ అయింది. అంతేగాక అప్ప‌టివ‌ర‌కు లోకేశ్‌ ఎల్సీయూలో భౄగం అంటూ ప్ర‌చారం భారీగా జ‌ర‌గ‌డం కూడా సినిమాకు ఫుల్ హైప్ తీసుకు వ‌చ్చింది. తీరా తెల్లారి సినిమా రిలీజ్ అన‌గా ఇది ర‌జ‌నీపై గౌర‌వంతో నేను చేసిన స్టాండ‌లోన్ సినిమా అంటూ లోకేశ్ కొత్త‌ బాంబు పేల్చడంతో ప్రేక్ష‌కులు కాస్త నిరుత్సాహ ప‌డ‌క త‌ప్ప‌లేదు. ఆపై సినిమా కూడా అశించినంత‌గా లేక‌ ఆడియ‌న్స్ ను తీవ్రంగా నిరాశ ప‌రిచింది. అయితే.. ఇప్పుడీ సినిమా నెల గ‌డ‌వ‌క మునుపే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

దేవరాజ్‌ అలియాస్‌ దేవ (Rajinikanth) ఓ పోర్ట్‌లో కూలీ. అతని నంబర్‌ 5821. అత‌నిని నమ్ముకుని ఉన్న కూలీ గ్యాంగ్‌తో ద‌శాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటాడు. అయితే తన చిరకాల మిత్రుడు, చెల్లిని ఇచ్చిన బావమరిది రాజశేఖర్‌ (సత్యరాజ్‌) చ‌నిపిఓయిన‌ట్లు స‌మాచారం అంద‌డంతో చివ‌రి చూపుకు వెళ‌తాడు. కానీ రాజశేఖర్ ముగ్గురు కూతుళ్లు దేవ‌ను దూరం పెడ‌తారు. అదే స‌మ‌యంలోనే రాజ‌శేఖ‌ర్‌ది స‌హాజ మ‌ర‌ణం కాద‌ని, ఎవ‌రో కావాల‌నే చంపార‌ని తెలుసుకున్న దేవ వారిని వెతికే ప‌నిలో ప‌డ‌తాడు. అందుకు పోర్టులోని సైమ‌న్ అండ్ గ్యాంగ్ ద‌యాళ్ కార‌ణ‌మ‌ని తెలుసుకుని అక్క‌డ ప‌నిలో చేరి అన్ని ఆధారాలు రాబ‌డుతుంటాడు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఇల్లీగ‌ల్‌గా అక్ర‌మ‌ ర‌వాణా చేస్తున్నార‌ని తెలుసుకుంటాడు. ఈ విష‌యం కాస్త‌ దాకా చేర‌డం, ద‌యాల్ మ‌రో ట‌ర్న్ తీసుకోవ‌డ‌డంతో కథ కొత్త ట‌ర్న్ తీసుకుంటుంది.

Coolie

ఇంద‌కు పోర్టులో జ‌రుగుతున్న‌వ్య‌వ‌హారం ఏంటా, దేవ‌కు, సైమ‌న్‌తో ఉన్న సంబంధం ఏంటి, ఇంత‌కు ద‌యాళ్ చేసిన ప‌నేంటి అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది. అయితే.. లోకేశ్ నుంచి ఊహించ‌ని స‌బ్జెక్ట్‌తో సినిమా రావ‌డం, స్క్రీన్ పై జ‌రిగే , జ‌ర‌గ‌బోయే సీన్లు ముందుగానే అంచ‌నా వేయ‌డం సినిమాకు పెద్ద మైన‌స్‌. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ పాత చింత‌కాయలా ఉండి, లాజిక్‌కు వెయ్యి కిలోమీట‌ర్లు దూరం ఉండి ఏం చేస్తున్నాంరా నాయ‌నా అనే ఫీల్ వ‌స్తుంది. ద‌యాళ్ ఎస్కేపింగ్ సీన్ చూస్తే ఇది అస‌లు ఖైదీ, విక్ర‌మ్ మూవీస్ తీసిన లోకేశే తీశాడా అని అనిపించ‌క త‌ప్ప‌దు. ఇక ఇప్పుడు ఈ కూలీ (Coolie) చిత్రం ఈ రోజు గురు వారం (సెప్టెంబ‌ర్ 11) నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమాంగ్‌కు వ‌చ్చేసింది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు ఒక్క‌సారి చూడొచ్చు.. అల్రేడీ చూసిన వాళ్లు మ‌ర‌లా చూడాల్సిన అంతా అవ‌స‌ర‌మూ లేదు.

Updated Date - Sep 11 , 2025 | 06:42 AM