Alappuzha Gymkhana OTT: ఓటీటీకి.. ప్రేమ‌లు హీరో లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్! ఎందులో అంటే?

ABN , Publish Date - Jun 03 , 2025 | 07:37 AM

ప్రేమ‌లు న‌టుడు నస్లెన్ న‌టించిన స్పోర్ట్స్, కామెడీ చిత్రం అలప్పుజ జింఖానా ఓటీటీకి రెడీ అయింది.

Alappuzha Gymkhana

గ‌త సంవ‌త్స‌రం ప్రేమ‌లు అనే మ‌ల‌యాల అనువాద చిత్రంతో తెలుగు వారికి ద‌గ్గ‌ర‌య్యాడు యువ న‌టుడు నస్లెన్ (Naslen). తాజాగా ఆయ‌న‌ మ‌రో ముగ్గురితో క‌లిసి న‌టించిన నూత‌న చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana) ఏప్రిల్ 10న కేర‌ళ‌లో, 25న తెలుగు నాట‌ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. రెండేండ్ల క్రితం టొవినో థామ‌స్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ కాంబోలో బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేర‌ళ‌ను షేక్ చేసిన క‌లీద్ ర‌హ‌మాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. కేవ‌లం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసి ఈ ఏడాది కేర‌ళ‌లో హ‌య్యెస్ట్ గ్రాసాంగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల త‌ర్వాత‌ ఇప్పుడు ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

క‌థ విష‌యానిక వ‌స్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత‌, పెద్దోడు, చిన్నోడు, సెహ‌నావాస్ ఐదుగురు చిన్న‌ప్ప‌టి నుంచి ప్రాణ స్నేహితులు. అప్పుడే వ‌చ్చిన ఇంట‌ర్ ఫలితాల్లో ఐదుగురిలో ఒక‌రు మాత్ర‌మే పాస్ అవుతారు. దాంతో వాళ్లు సెల‌బ్రేట్ చేసుకునిత‌ర్వాత ఏదైనా కొత్త‌గా ట్రై చేయాల‌ని అనుకుని మ‌న వాళ్ల కానీ ప‌ని అని తెలుసుకుని ఆఖ‌ర‌కు బాక్సింగ్ నేర్చుకుని టోర్న‌మెంట్స్ ఆడి కాలేజీలో పాస్ మార్కుల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని స‌మీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడ‌మీలో శిక్ష‌ణ‌ కోసం చేరుతారు. అక్క‌డి నుంచి వారి ప్ర‌యాణం ఎలా సాగింది, డిస్ట్రిక్‌ లెవ‌ల్‌, స్టేట్ లెవ‌ల్ టోర్న‌మెంట్ల‌లో పాల్గొన్నారా, విజ‌యం సాధించారా చివ‌ర‌కు ఏమైంది. జీవితంపై సీరియ‌స్‌నెస్ లేని కుర్రాళ్లు బాక్సింగ్ కోసం వెళ్లి చేసిన సాహాసాలే సినిమా ప్ర‌ధాన‌ పాయింట్‌.

Alappuzha Gymkhana

సినిమా ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ ఫ‌న్ సాగుతూ ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే వినోదం పంచుతుంది. మూవీలో హీరో న‌స్లైన్ త‌ప్ప అంద‌రూ మ‌న‌కు ఏమాత్రం ప‌రిచ‌యం లేని మొహాలే అయిన‌ప్ప‌టికీ వారి న‌ట‌న‌, డైలాగులు, వ‌న్ లైనర్స్ వాటినన్నింటినీ మ‌రిచి పోయేలా చేస్తుంది. సినిమాలో ఐదుగురి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది, వారి చుట్టే క‌థ తిరుగుతూన‌వ్వులు పూయిస్తుంది. ఫ‌లానా వాడు హీరో అని చెప్ప‌లేం. సినిమా స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు నాట బాగా వైర‌ల్ అయిన అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వ‌ద్ద జాత‌కం చూపించి చెప్పాలా వంటి వ‌న్ లైన‌ర్స్ తో కిక్ ఇస్తారు. ఫ‌స్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్‌, అమ్మాయిల‌కు సైట్ కొట్టే స‌న్నివేశాలు ప్ర‌తి ఒక్క‌రినీ క‌డుపుబ్బా న‌వ్విస్తాయి.

ఎక్క‌డా వ‌ల్గారిటీ, అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌ల‌కు తావీవ‌కుండా పాత్ర‌ల మ‌ధ్య నుంచి సంద‌ర్భోచిత‌ కామెడీతో మొద‌టి 20 నిమిషాలు.. చివ‌రి 30 నిమిషాలు పంచ్ డైలాగులు, యాక్ష‌న్‌సీన్లతో మోత మోగిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో స‌న్నివేశం హైలెట్‌. సినిమాలో అల‌రించే పాట‌లు లేక పోయినా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 5నుంచి సోనీల లివ్ (SONY LIV)ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. చివ‌రి వ‌ర‌కు మంచిగా ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా హాయిగా మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెత‌క్కుండా కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.

Updated Date - Jun 03 , 2025 | 07:37 AM