OG OTT: ఇక ఇంట్లోనే పూనకాలు.. ఓటీటీకి ఓజీ! ఎక్స్ టెండెడ్ కట్‌తో.. ఎప్పటినుంచంటే?
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:39 AM
సెప్టెంబర్25 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రం ఓజీ.
సెప్టెంబర్25 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రం ఓజీ (OG ). సాహో వంటి హిట్ చిత్రం తర్వాత సుజిత్ ఆ సినిమాకు దర్శకత్వం వహించిడంతో ఈ సినిమాకు అంతకుమించి కూడా తక్కువ అనేలా హైప్ ఏర్పడింది. RRR, సరిపోదా శనివారం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియాంకా మోహన్, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హస్మా, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న ఈ మూవీ తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
జపాన్‌లో అక్కడి ప్రఖ్యాత యుద్ద విద్యల్లో నేర్పు సంపాదించిన గంభీర తన వారందరినీ కోల్పోతాడు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో దాదా అనే వ్యక్తిని కాపాడి అతనితో పాటే ముంబయ్ చేరుకుంటాడు. ఆపై దాదా సారథ్యంలో గంభీర తనకున్న విద్య సాయంతో ముంబై మాఫియా అంతటిని తన చేతిలోకి తెచ్చుకుని దాదా ఎంత చెబితే అంత స్థాయికి అక్కడి వారిని తీసుకువ స్తాడు. ఈక్రమంలో సడన్‌గా ఓ రోజు దాదా పెద్ద కుమారుడు చనిపోవడం, ఆరోజు నుంచే గంభీర కూడా కనడబకుండా పోయి దూర ప్రాంతంలో చాలా ఏండ్లు రహస్యంగా జీవితం సాగిస్తుంటాడు. ఆ తర్వాత ఓమీ క్రమంగా ఆ మాఫియాను తన గుప్పిట్లోకా తెచ్చుకోవాలని చూస్తంటాడు.
ఈ నేపథ్యంలో గంభీర ఎందుకు రహస్యంగా జీవించాడు, దాదా పెద్ద కుమారుడిని ఎందుకు చంపాడు, ఇంతకు గంభీర బ్యాగ్రౌండ్ ఏంటి, తిరిగి వచ్చి ఓమీని ఎలా మట్టుబెట్టాడనేదే సింపుల్‌గా ఈ చిత్రం కథ. ప్రతి పది నిమిషాలకు ఓ ఎలివేషన్, యాక్షన్ సీన్లు, పవన్ కల్యాణ్ చరిష్మా సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. ముఖ్యంగా తమన్ (Thaman) సంగీతం ఈ చిత్రాన్ని బ్యాక్బోన్ ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో హైలెట్ చేశాడు. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (NetflixI) ఓటీటీ (OTT)లో ఆక్టోబర్ 23 నుంచి తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. అది కూడా థియేటర్ వెర్షన్ కాకుండా ఎక్ట్సెండెడ్ కట్‌తో అదనపు సన్నివేశాలతో ఓజీ (OG ) సినిమా రానుంది. అశ్లీల న్నివేశాలు లేవు గానీ హింసాత్యక సీన్లు భారీగానే ఉన్నందు వళ్ల పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది.