Thammudu OTT: తమ్ముడు.. ఇక్కడైనా అలరిస్తాడా
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:21 AM
నితిన్, దిల్ రాజుల చిత్రం తమ్ముడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఇటీవల థియేటర్లకు వచ్చిన తమ్ముడు (Thammudu) చిత్రం, భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ వంటి నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాత. ఇప్పుడీ ఈ సినిమా ఈ రోజు (ఆగస్ట్ 1) నుంచినెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ వేదికగా తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే.. తల్లిని కోల్పోయిన జైకి అతడి అక్క స్నేహలత (లయ) తల్లిలా మారి పెంచుతుంది. అయితే.. ఓ రోజు తమ్ముడు జై చేసిన పని వళ్ల తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక పోయి, మరో కొత్త వ్యక్తిని పెళ్లాడాల్సి రావడంతో తమ్ముడిపై కోపంతో అతడిని దూరం పెడుతుంది. అలా సంవత్సరాలు గడిచి పోతాయి. కాలక్రమంలో జై పెద్దవాడై అర్చరీలో రాణిస్తాడు. కానీ తరుచూ తనకు వచ్చే అక్క జ్ఞాపకాల వళ్ల గోల్డ్ మెడల్ సాధించడంలో విఫలం అవుతుంటాడు.
ఈ నేపథ్యంలో తన అక్క కోసం వెతుకుతున్న జైకి ఒక రోజు స్నేహలత ప్రభుత్వం ఉద్యోగిగా అడవిలో ప్రమాదంలో చిక్కుకుందని తెలుసుకుని ఆమెను రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ ప్రమాదకర ప్రయాణంలో తమ్ముడు అక్కను కాపాడగలిగాడా? ఆమెను రక్షించాలని చేసే యత్నాల్లో ఏమేం త్యాగాలు చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
అయుతూ.. ‘తమ్ముడు’ (Thammudu) కథలో బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ప్రధానంగా ఉన్నప్పటికీ, భావోద్వేగాలు అంతగా పండలేదు, ఒకదాని తర్వాత మరో ఫైట్ వస్తూ కథ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, బేబీ దిత్య వంటి నటులకు మంచి పాత్రలు పడ్డప్పటికీ, వాటిని మైలెట్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. థియేటర్లో మిస్ అయినవారు, ఓటీటీలో చూసే ప్లాన్‌లో ఉన్నవారు మాత్రం ఓసారి ప్రయత్నించవచ్చు.