Brick OTT: ఓటీటీలో ఇరగదీస్తున్న.. లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్! ఎందులో చూడాలంటే
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:23 AM
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్ బ్రిక్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్ బ్రిక్ (Brick) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జర్మన్ భాషలో వచ్చిన ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా నిర్మించగా ఫిలిప్ కోచ్ (Philip Koch) రచించి, దర్శకత్వం వహించారు. మాథియాస్ ష్వీఘ్ఫెర్ (Matthias Schweighöfer), రూబీ ఓ ఫీ (Ruby O. Fee) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ చిత్రం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త థ్రిల్‌ను పంచుతోంది. చూసిన వారంతా మరి కొంతమందిని చూడమని రెఫర్ చేస్తున్నారు. 1 గంట 39 నిమిషాల నిడివితో సినిమా చివరి వరకు స్సపెన్స్, ట్విస్టులతో అలరిస్తుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టిమ్, ఒలివియా భార్యాభర్తలు. ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ ఉంటారు. అయితే ఒటివియాకు మిస్ క్యారేజ్ అవడంతో మానసికంగా కాస్త బలహీనం అవుతారు. దాంతో వారిద్దరు ముభావంగా ఒకరికొకరు దూరంగా ఉంటూ ఆ ఇంట్లోనే వేర్వేరుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని ఒలీవియా ఓ ట్రిప్ ఫ్లాన్ చేస్తుంది.
దానికి టిమ్ అంగీకరించక పోవడంతో ఒలివియా ఒంటరిగానే వెళ్లాలని పిక్స్ అయి బయటకు వెళ్లడానికి డోర్ తెరవగా ఆశ్చర్యకరంగా గోడలు దర్శనమిస్తాయి. చివరకు కిటికీల వద్ద కూడా అదే తరహా గోడలు ఉండి, వారు ఇంటి నుంచి బయటకు పోలేకుండా, బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, నెట్ వర్క్ సిగ్నల్ సైతం రాకుండా బందీ అయిపోతారు. వీరితో పాటు మరో నాలుగైదు ఫ్లాట్ల వాళ్లు సైతం ఇలాగే ఇరుక్కుపోతారు.
ఇలాంటి పరిస్థితిలో వారు ఎందుకు బంధించబడ్డారు? అక్కడి నుంచి బయట పడగలిగారా, లేదా.. అలా ఎవరు, ఎందుకు చేశారు, దీని వెనకాల ఉన్నదెవరనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ చిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు చూస్తున్నంత సేపు అదిరిపోయే థ్రిల్ పంచుతూ సస్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. మూవీ మధ్యలో వచ్చే రెండు జంటల పాత్రలు ఆకట్టుకుంటాయి. అదేవిధంగా భార్యను కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు సైతం అబ్బుర పరుస్తాయి.
ఇక విజువల్స్, టేకింగ్ పరంగా కూడా సినిమా హై రేంజ్‌లో ఉంటుంది. ఎక్కడా బోర్ అనే మాట రాకుండా ఆడియన్స్ ను కట్టి పడేసేలా చేసింది. అలానే, ఎక్కడా ఎలాంటి అభ్యంతర కర సన్నివేశాలు లేకుండా సినిమాను తెరక్కించారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో జర్మన్‌తో పాటు తెలుగు, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది. మంచి థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వొద్దు, ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు.