Squid Game: స్క్విడ్ గేమ్3.. టీజర్ వచ్చేసింది! ఈ సారి మరింత రంజుగా
ABN , Publish Date - May 06 , 2025 | 02:37 PM
ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న ఆప్డేట్ వచ్చింది. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సీజన్3 విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మూడవ సీజన్ ఆఫీసియల్ రిలీజ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న ఆప్డేట్ రానే వచ్చింది. మూడు సంవత్సరాల క్రితం అనామకంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి సంచలనం సృష్టించిన స్క్విడ్ గేమ్ (Squid Game) వెబ్ సిరీస్ సీజన్3 విడుదలకు రెడీ అవుతోంది. అ క్రమంలో తాజాగా మేకర్స్ పార్ట్2కు సంబంధించిన ట్రైలర్‌ను ఆ ఫైనల్ గేమ్ బిగిన్స్ అని క్యాప్సన్‌తో రిలీజ్ చేశారు. జూన్ 27న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రకటించారు. ఇప్పుడీ ట్రైలర్ నెట్టింట బాగా హాడావుడి చేస్తోంది.
సెకండ్ సీజన్ కథ విషయానికి వస్తే.. మొదటి సీజన్‌లో గేమ్ గెలిచిన 456 నంబర్ ప్లేయర్ అక్కడ జరుగుతున్న అకృత్యాలను బయటి ప్రపంచానికి తెలపాలని నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో పకడ్బందీ ప్రణాళికలతో తిరిగి మరోసారి గేమ్‌లోకి అడుగు పెడతాడు కానీ ముందస్తుగా చేసుకున్న ఫ్లాన్స్ విఫలమై ఆక్కడేచిక్కుకు పోతాడు. అంతకుముందు ఆడిన ఆటలా కాకుండా మరో విధమైన ఆటలు, రూల్స్ ఉండడంతో అందరినీ అప్రమత్తం చేస్తూ ఉంటాడు. ఈనేపథ్యంలో అక్కడి వారితో ఓ టీమ్‌ను రెడీ చేసుకున్ని అక్కడి వారిపై దాడి చేసి తప్పించుకోవాలని చూసినా చివరలో ఒకరి నమ్మక ద్రోహంతో ఆ ఫ్లాన్ విఫలమై వారికి దొరికి పోతాడు. ఇక్కడితో రెండవ సీజన్‌ను ముగించిన మేకర్స్ త్వరలో మూడవ సీజన్ అంటూ ముగించారు.
ఇక మఈ మూడో సీజన్ నేపథ్యానికి వచ్చేసరికి తప్పించుకోవాలని చూసి నిర్వాహాకులకు దొరికిన నంబర్ 456 అండ్ టీమ్‌ను తిరిగి గేమ్‌లోకి ప్రవేశపెడతారు. గేమ్‌లోకి వచ్చిన వారు ఎలా సర్వైవ్ అయ్యారు. గేమ్ గెలిచారా, అక్కడి నుంచి బయట పడ్డారా, తమను మోసం చేసిన వ్యక్తిని కనిపెట్టారా లేదా అతనెవరు, ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఈ గేమ్ జరిగే ప్రాంతాన్ని గుర్తించాడా, ఆ గేమ్‌లో నిర్వాహకులకు వ్యతిరేఖంగా పని చేసే లేడీ ఏం చేసిందనే ఆసక్తికరమైన కథనం, డిఫరెంట్ రూల్స్‌తో, టాస్కులు, ట్విస్టులతో ఓళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లతో ఈ స్క్విడ్ గేమ్ (Squid Game) సిరీస్ ముగియనుంది.
రెండో సీజన్ వచ్చిన ఇరు నెలల విరామం తర్వాత వస్తున్న స్క్విడ్ గేమ్ (Squid Game) మూడో సీజన్ జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈఇందుకు సంబంధించి విడుదల చేసిన అఫీసియల్ టీజర్ రెండు మూడు గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు తిరగరాస్తుంది. సీజన్ 1లో నటించిన లీ జంగ్ జే (Lee Jung-jae), పార్క్ హే సూ, హోయాన్ జంగ్‌లతో పాటు యిమ్ సి-వాన్ (Im Si-wan), కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్ కీలక పాత్రల్లో నటించారు. మొదటి, రెండ సీజన్‌లను తెరకెక్కించిన హ్వాంగ్ డాంగ్-హ్యూక్ (Hwang Dong-hyuk) ఈ మూడవ సిరీస్‌కు సైతం దర్శకత్వం వహించాడు.