Sri Sri Sri Raja Vaaru OTT: ఓటీటీకి వచ్చిన.. నార్నే నితిన్ మొట్టమొదటి చిత్రం
ABN , Publish Date - Jul 04 , 2025 | 07:01 AM
నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన మొట్ట మొటి చిత్రం శ్రీశ్రీశ్రీ రాజ వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిటిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithiin) హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన మొట్ట మొటి చిత్రం శ్రీశ్రీశ్రీ రాజ వారు (Sri Sri Sri Raja Vaaru) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిటిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల జూన్6న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. అయితే సుమారు మూడేండ్ల క్రితమే నిర్మితమైన ఈ సినిమా విడుదలకు అవాంతరాలు వచ్చి ఆగిపోగా ఆ తర్వాత నార్నే నితిన్ హీరోగా మ్యాడ్, ఆయ్, మ్యాడ్ 2 వంటి చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. ఈక్రమంలోనే మ్యా్ 2 రిలీజై వెళ్లిన వెంటనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.‘శతమానం భవతి’తో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సతీశ్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. సంపద (Sampaada) హీరోయిన్‌గా నటించగా, రావు రమేశ్, నరేశ్ విజయ కృష్ణ, ప్రవీణ్ లక్కరాజు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. రాజా (నార్నే నితిన్) పుట్టుకతోనే సిగరెట్‌కు బానిస. ఆ అలవాటు వల్లే ఊర్లో వాళ్లంతా తనని వెటకారంగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అని పిలుస్తుంటారు. రాజాకి చిన్నప్పటి నుంచి కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే ఇష్టం. వారి నిశ్చితార్థం రోజు రాజా చేసిన ఓ తప్పు వల్ల పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిణామాల వల్ల రాజా తండ్రి సుబ్బరాజు (నరేశ్), కృష్ణమూర్తికి ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఊర్లో ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తన కొడుకు మళ్లీ సిగరెట్ ముట్టడని, ఈ పందెంలో గెలిస్తే నిత్యను తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని, ఎంపీటీసీ బరి నుంచి తప్పుకోవాలని షరతు పెడతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా ఓకే అంటాడు.
తండ్రి చేసిన ఛాలెంజ్.. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం రాజా సిగరెట్ అలవాటు వదులుకు న్నాడా? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? రాజాతో సిగరెట్ కాల్పించేందుకు కృష్ణమూర్తి చేసిన ప్రయత్నాలు వర్కవుట్ అయ్యాయా? తదుపరి ఏమైంది? అన్నది కథ. ఓ మలయాళ సినిమా ఆధారంగా అక్కడి నేపథ్యాన్ని మార్చి తెలుగుకు అనుగుణంగా దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించా డు. అయితే రొటీన్ కథకథనాలు కావడంతో చూసే వారికి పాత సినిమానే చూస్తున్న ఫీల్ వస్తుంది. ఇంతవరకు థియేటర్‌లో చూడని వారు ఓ సారి ఈ చిత్రాన్ని చూసేయవచ్చు. ఇప్పుడీ శ్రీశ్రీశ్రీ రాజ వారు (Sri Sri Sri Raja Vaaru) సినిమా ఆహా (Aha Video), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) రెండు ఓటీటీ (OTT Platforms)ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సిగరెట్ కాల్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ల దీర్ఘ చుంబనం దృశ్యాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫ్యామిలీతో కలిసి చూసే వారు కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం.