Sundarakanda OTT: ఓటీటీకి.. నారా రోహిత్ లేటెస్ట్ ఫీల్‌గుడ్ మూవీ! ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:48 AM
గత నెల చివరిలో థియేటర్లకు వచ్చి అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించిన చిత్రం సుందరాకాండ.
గత నెల చివరిలో థియేటర్లకు వచ్చి అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించిన చిత్రం సుందరాకాండ (Sundarakanda). చాలా రోజుల తర్వాత హీరో నారా రోహిత్ (Nara Rohit) ఈ చిత్రంతో మంచి కం బ్యాక్ ఇచ్చారు. ఈ మూవీకి వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. విర్తి వాఘని (Virti Vaghani), ఈశ్వర్ శ్రీదేవి (Sridevi Vijay Kumar) కథానాయికలు. సీనియర్ నరేశ్ (Naresh Vijaya Krishna), వాసుకీ, సత్య (Sathya), అభినవ్ (Abhinav), సునయన (Sunaina) కీ రోల్స్ చేశారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
కథ విషయానికి వస్తే.. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కానీ సిద్థార్థ్ ఇంకా సంబంధాల కోసం తను ఇష్టపడ్డ సీనియర్ వైఫ్ణవిలో తనకు నచ్చిన 5 క్వాలిటీలు ఉన్న అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంటాడు. ఓ రోజు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఐరాని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దాంతో అమెరికా క్యాన్సిల్ చేసి అ అమ్మాయి చదివే కాలేజీలో లెక్చరర్‌గా చేరి ఐరా ప్రేమను సాధించగలుగుతాడు.
ఐరా తల్లితో తమ పెళ్లి విషయం మాట్లాడటం కోసం వెళ్లిన సిద్థార్థ్‌కి తన చిన్ననాటి లవర్ వైష్ణవి కూతురే ఐరా అనే షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్టోరీ ఎన్ని మలుపులు తిరిగింది.. అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తితో పెళ్లికి వైష్ణవి ఒప్పుకుందా లేదా, అసలు ఎక్స్ లవర్ అని తెలిశాక ఏం చేసింది, ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి సిద్థార్థ్ చేసిన ప్రయత్నాలేంటి, అవి ఎక్కడికి దారి తీశాయి, చివరకు కలిశారా లేదా , పెళ్లి జరిగిందా, లేదా చివరలో ఐరా ఇచ్చిన ట్విస్ట్ ఏంటనే పాయింట్‌తో సినిమా అద్యంతం ఉల్లాసంగా, ఫన్నీవేలో సాగిపోతుంది.
ఎక్కగా ఎలాంటి అసభ్యత, వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఆరోగ్యకరమైన హస్యంతో ప్రతీ ఫ్రేమ్ కొత్తగా , కలర్‌ఫుల్‌గా ఉండి చూసే వారికి మంచి ఫీల్ ఇస్తుంది. బోర్ కట్టే ఒక్క సన్నివేశం కూడా లేకుండా అప్పుడే అయిపోయిందా అనిపించేలా సినిమా ఉంటుంది. ఇంటిల్లిపాది ఎలాంటి బెరుకు లేకుండా ఎంచక్కా కలిసి చూసేయవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా త్రివిక్రమ్ స్టైల్ రైటింగ్, సత్య కామెడీ పంచ్‌లు, హీరోయిన్ విర్తి వాఘని అందం, డ్రెస్సింగ్, స్క్రీన్ ప్రెజన్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ సుందరాకాండ (Sundarakanda) చిత్రం సెప్టెంబర్ 23 (September 23 ) నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ (OTT )లో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, ఫ్యామిలీ సినిమాలు ఇష్ట పడే వారు తప్పక చూడాల్సిన సినిమా ఇది.