Hit3 OTT: నాని ర‌క్త సునామీ.. హిట్‌3 ఓటీటీకి వ‌చ్చేసింది

ABN , Publish Date - May 29 , 2025 | 08:29 AM

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య మే1న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి భారీ విజ‌యం సాధించిన చిత్రం హిట్‌3 డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

nani

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య మే1న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి భారీ విజ‌యం సాధించిన చిత్రం హిట్‌3 (HIT 3). నాని(Nani) హీరోగా న‌టించ‌డంతో పాటు స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రానికి హిట్ యూనివ‌ర్స్ ఫ్రాంఛైజీల డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను (Sailesh Kolanu) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో నెవ‌ర్ బిఫోర్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాన నాని యాక్ష‌న్‌, మాస్ చిత్రాల‌కు బాగా సూట్‌ అవుతాడ‌నే విధంగా ఈ సినిమా అసాంతం యాక్ష‌న్ సీన్ల‌తో తెర‌కెక్కింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే మోస్ట్ వ‌య‌లెంట్ చిత్రంగా ముద్ర వేసుకుంది. ఇప్పుడీ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన నెల రోజుల త‌ర్వాత డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

వైజాగ్ హిట్ టీమ్‌లో ఎస్పీగా ఉన్న‌ అర్జున్ సర్కార్ వ‌ద్ద‌కు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒక‌రికొక‌రు సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషులను ఒకే విధంగా హ‌త్య‌ల చేసిన‌ కేసు వ‌స్తుంది. ఆ కేసులు ప‌రిశోధిస్తున్న స‌మ‌యంలో అంత‌కుముందు జ‌రిగిన లాంటివే దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల ల‌క్ష్యం ఏంటీ? వాళ్ళు ఎందుకింత క్రూరంగా మనుషులను చంపుతున్నారు? అనే దానిపై తన అసిస్టెంట్స్ సాయంతో ఈ ఆపరేషన్‌ను టేకప్ చేస్తాడు. ఈక్ర‌మంలో అర్జున్‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి, అర్జున్ కూడా హ‌త్య‌లు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? మృదుల (శ్రీనిధి శెట్టి Srinidhi Setty) ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయింది. చివ‌ర‌కు కిల్ల‌ర్స్ను ప‌ట్టుకోగ‌లిగారా లేదా అనే హింసాత్మ‌క‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

GsEUa4hbQAAyLpq.jpeg

ఎప్పుటిక‌ప్పుడు డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ విజ‌యాలు సాధిస్తున్న హీరో నాని ప్రస్తుతం త‌న‌కు ఉన్న‌ సాఫ్ట్ ఇమేజ్ చట్రం నుంచి బయట పడ‌డానికి చేసిన ఈ ప్ర‌య‌త్నం బాగానే ఉన్నా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు సినిమా కాస్త దూరం అయింది. ఫ‌స్టాప్లో నాని స్టైల్ వ‌న్ లైన‌ర్స్‌, సురిశిత హ‌స్యం ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ వ‌చ్చిన బూతుల్లో కొట్టుకుపోయింది. ఇక సెకండాఫ్ నుంచి మ‌రో మాట లేకుండా అర్జున్ సర్కార్ ఊచకోత మొద‌లై దానికి అంతేలేకుండా పోయింది. ఇప్పుడీ సినిమా ఈ రోజు (మే 29) గురువారం ఉద‌యం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, ఇంసాత్మ‌క చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు, ఇంటివ‌ద్దే చూసేయ‌వ‌చ్చు. అయితే సున్నిత మ‌న‌స్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండ‌డం ఉత్త‌మం.

Updated Date - May 29 , 2025 | 08:31 AM