Mithra Mandali: ఓటీటిలో 'కాంతార-2'కు దగ్గరగా.. 'మిత్ర మండలి'
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:06 PM
'మిత్ర మండలి' చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్లో అవుతోంది. ఓటిటిలో సంచలనం సృష్టితోంది
ప్రియదర్శి(Priyadarshi), నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మిత్ర మండలి' (mithra Mandali) . విజయేందర్ ఎస్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ కీలక పాత్రధారులు. కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలైన చక్కని ఆదరణ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon prime Trending) స్ట్రీమింగ్లో అవుతోంది. అందులో టాప్ #2 ట్రెండింగ్ లో నిలిచింది ఈ సినిమా . ప్రస్తుతం టాప్ #1 ట్రెండింగ్ లో ఉన్న కాంతార చిత్రానికి పోటీగా నిలుస్తూ మరింత వేగంగా ప్రేక్షకులను అలరిస్తూ మిత్ర మండలి దూసుకు వెళ్తోంది.
ఒక నగరంలో నలుగురు మిత్రుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలను సహజంగా గా చూపిస్తూ, వారి మధ్య జరిగే సన్నివేశాలను, సందర్భాలను పూర్తి స్థాయిలో వినోదభరితంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు విజయేందర్ సరికొత్త శైలిలో మిత్రమండలి చిత్రాన్ని తెరకెక్కించగా నటీనటుల నటన, సంగీతం అన్నీ కలిసి సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బహుశా ఇదే ట్రెండింగ్ లో ఇంతటి ర్యాంకింగ్ సాధించటానికి కారణం అంటున్నారు చిత్ర నిర్మాతలు.