Lokah Chapter 1 OTT: మలయాళ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ కొత్త లోక.. ఓటీటీకి వచ్చేసింది
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:23 AM
సినిమా థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం లోకా తెలుగులో కొత్త లోకా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
సినిమా థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిడంతో పాటు పాత రికార్డులను చెరిపి వేసి సరికొత్త చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం లోకా ( Lokah: Chapter 1 - Chandra ) తెలుగులో కొత్త లోకా (Kotha Loka 1 Chandra )గా వచ్చింది. కేవలం పాతిక కోట్ల బడ్జెతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు చివరి వారంలో థియేటర్లలో విడుదలై ప్రపంంచ వ్యాప్తంగా రూ.300 కోట్లను రాబట్టి కేరళ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. ఇప్పటివరకు మోహన్ లాల్ పేరిట మాత్రమే ఉన్న నాలుగైదు రికార్డులను చెరిపేసి కేరళ ఆల్‌టైం బ్లాక్ బస్టర్‌గా, హయ్యస్ట్ మలయాళ గ్రాసర్‌గా ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటి ఈ చిత్రం ఎట్టకేలకు మూడు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది
కథ విషయానికి వస్తే.. రాజుల కాలంలో ఓ గిరిజన ప్రాంతంపై సమీప రాజు దాడి చేసి అక్కడి ప్రజలపై మారణకాంగడ సృష్టిస్తాడు. ఆ సమయంలో వారి నుంచి తప్పించుకున్న నీల అనే బాలిక ఫ్యామిలీ ఓ కొండ గుహాలో తలదాచుకుంటారు. అక్కడ నీల విరిగిపోయిన అమ్మవారి విగ్రహాన్ని చూసిన తర్వాత అతీంద్రియ శక్తులు పొంది అప్పటి నుంచి ఇమ్మోర్టల్ అవుతుంది. తనకు లభించిన శక్తులను మంచి కోసం మాత్రమే వినియోగిస్తూ కాలం వెళ్లదీస్తుంది. దేశదేశాలు తిరుగుతూ తను గురువుగా భావించే వ్యక్తి కనుసన్నలో జీవిస్తూ ఉంటుంది.

కొన్ని శతాబ్దాల తర్వాత నీల తనకు వచ్చిన ఆదేశాల మేరకు బెంగళూరులో చంద్ర పేరుతో జీవిస్తూ హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తూ ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే సన్నీ చంద్రను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే.. కానీ నగరంలో అవయవాల అక్రమ రవాణా మాఫియాను చూసిన తర్వాత చంద్ర జీవితం మారిపోతుంది. సూపర్ పవర్స్ ఉన్న ఈమె ఈ మాఫియాను ఎలా ఎదుర్కొంది? ఆమె రహస్యమైన గతం ఏంటి? అనే మిస్టరీ సినిమాకి బలం. విజువల్స్, యాక్షన్ సీన్స్ మేస్మరైజ్ చేస్తాయి. అయితే.. ఈ మూవీ ప్రథమార్ధం ఆసక్తికరంగా ఉన్నా... సెకండాఫ్‌లో టొవినో థామస్ ఎంట్రీ, సౌబిన్ షాహిర్ గెస్ట్ రోల్, క్లయిమాక్స్ లో దుల్కర్ సల్మాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం వీక్షకులను గజిబిజికి గురి చేస్తుంది..
దర్శకుడు అరుణ్, నిర్మాత దుల్కర్ (Dulquer Salmaan) తీయాలనుకుంటున్న 'లోక' యూనివర్స్ లో లోక 1: చంద్ర తొలి భాగం. ఇంకా ఎనిమిది సినిమాలు ఈ సిరీస్‌లో రానున్నాయి. ఓనమ్ సందర్భంగా ఆగస్టు 28న మలయాళంలో, ఆ తర్వాత 30న ఇతర భాషల్లో విడుదలైన అంతటా పాజిటివ్ టాకక్‌తో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం థియేటర్ రన్ ముగిసిన మూడు నెలల తర్వాత ఇప్పుడు జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్‌లో మిస్ అయిన వారికి ఇది మంచి అవకాశం. అసలు మిస్సవకండి. పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా చూస్తారు.
ఇందులో టైటిల్ రోల్ ను టీడ్ రోల్‌లో కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priaydarsan), ప్రధాన పాత్రలో ప్రేమలు నస్లేన్ నటించిన ఈ సినిమాకు డోమ్నిక్ అరుణ్ (Dominic Arun) దర్శకత్వం వహించగాస్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquar Salmaan) నిర్మించడం విశేషం.