Sumathi Valavu OTT: ఓటీటీలో.. రచ్చ చేస్తున్న నిజమైన దెయ్యం సినిమా! ట్విస్ట్ తెలిస్తే మతులు పోవడమే
ABN , Publish Date - Sep 28 , 2025 | 07:42 PM
తాజాగా ఓటీటీకి వచ్చిన 'సుమతి వలవు' అనే మలయాళ హర్రర్, కామెడీ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
తాజాగా ఓటీటీకి వచ్చిన 'సుమతి వలవు' (Sumathi Valavu) అనే మలయాళ హర్రర్, కామెడీ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు1న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా కేరళలో చిన్నపాటి ప్రభంజనమే సృష్టించింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌లోనే రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల వరకు రాబట్టింది. తాజాగా గరెండు రోజుల క్రితం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆడియన్స్‌కు మంచి థ్రిల్ ఇస్తుంది. అర్జున్ అశోకన్ హీరోగా నటించగా లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ మాళవికా మనోజ్ (Malavika Manoj) కథానాయికగా చేసింది. గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, శ్శివాద కీలక పాత్రలు చేశారు.
కథ విషయానికి వస్తే.. తిరవనంతపురం దగ్గర్లోని ఓ మారుమూల ఊరి ప్రజలు రాత్రి అయితే ఊరు దాటి వెళ్లాలంటూ భయ పడుతుంటారు. ప్రధానంగా అడవి మధ్యలో ఉన్నసుమతి మలుపును దాటడానికి జంకుతుంటారు. ఏం కాదని ధైర్యంగా పోయే వాళ్లకు వింత వింత ఘటనలు ఎదురై గాయాల పాలై అక్కడే సృహా కోల్పోతుంటారు. దీంతో ఎవరూ ఆ మార్గం వైపు వెళ్లడానికి సాహాసం చేయరు. అయితే ఆ గ్రామంలో వీడియో లైబ్రరీ నడుపుకునే అప్పు ఆ ఊరి స్కూల్‌లో పని చేసే భామను ప్రేమిస్తూ ఉంటాడు. కానీ గతంలో తమ ఇంటి పెద్ద బిడ్డ తప్పి పోవడానికి అప్పునే కారణం అని భామ వాళ్ల ఫ్యామిలీ అప్పుపై ఆగ్రహంతో ఉండి భామకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. సరిగ్గా అదే సమయంలో అప్పు షాప్‌లో పని చేసే మహిళ తన బిడ్డతో పాటు ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ కేసు అప్పు మీదకు వస్తుంది.
ఈ నేపథ్యంలో అప్పు ఏం చేశాడు, భామ అక్క మిస్సింగ్‌లో అతని పాత్ర ఏంటి, అలాగే అక్కడ ఆత్మహత్యలకు అప్పుకు ఉన్న లింకేంటి, ఇంతకు ఈ కథ మొత్తంలో సుమతి అనే దయ్యం పాత్ర ఏమిటి, దాని గతం ఏమిటి, దయ్యం ఎందుకు అయింది, అక్కడే ఎందుకు ఉంది, అక్కడకు వచ్చిన వారిని సృహా కోల్పేయేలా చేస్తుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా నడుస్తుంది. మనకు తెలిసిన రెగ్యులర్ కథే అయినా స్క్రీన్ ప్లే, అక్కడి లోకేషన్స్, ప్రతి 10, 15 నిమాషాలకు ఒక సారి వచ్చే సుమతి దయ్యం సీన్లు ఆ సందర్భంగా జరిగే హాడావుడి, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ చిత్రం జీ5 (Zee5) ఓటీటీ (OTT)లో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమిగ్ అవుతుంది.
ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ తెరకెక్కింది. ఇంటిల్లి పాది ఎంచక్కా అంతా కలిసి చూసేయవచ్చు. హర్రర్‌కు హర్రర్, కామెడీకి కామెడీ ఈ సినిమా స్పెషల్.పిల్లలకు తెగ ఎంజాయ్ చేస్తారు. ఇదిలాఉంటే ఈ సుమతి వలవు (Sumathi Valavu) సినిమా కేరళలోని తిరువనంత పురం సమీపంలోని మైలమూడు పరిసర గ్రామాల్లో ఐదారు దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న జానపద కథలు, కొన్ని రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందించడం విశేషం. సువతి వలవు అనేది సినిమా కోసంపెట్టిన పేరు కాదు. అది నిజంగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నదే కావటం గమనార్హం. 'సుమతి వలవు' అంటే తెలుగులో 'సుమతి మలుపు' అని అర్థం. ఇదిలాఉంటే.. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'సుమతి వలవ్ 2: ది ఆరిజిన్' ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.