Ghaati: స‌డ‌న్‌గా.. ఓటీటీకి అనుష్క‌ 'ఘాటీ'! స్ట్రీమింగ్ ఎందులో అంటే

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:18 AM

గ‌త నెల చివ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన చిత్రం ఘాటీ స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసింది.

Ghaati

గ‌త నెల చివ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన చిత్రం ఘాటీ (Ghaati). టాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుష్క శెట్టి (Anushka) చిత్రం అవ‌డం ఆపై క్రిష్ (Krish) ద‌ర్శ‌క‌త్వంలో ఐదేండ్ల త‌ర్వాత వ‌చ్చిన సినిమా కావ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డి చివ‌ర‌కు ఆ అంచ‌నాల‌ను అందుకోలేక డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాతో త‌మిళ హీరో విక్రమ్ ప్రభు (Vikram Prabhu) తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. ఇంకా జగపతిబాబు ( Jagapati babu), చైతన్యరావు, రవీంద్ర విజయ్ వంటి కీలక నటులతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

కథ ఏంటంటే..?

ఆంధ్ర – ఒడిశా సరిహద్దు, తూర్పు కనుమల్లో కాష్టాల నాయుడు, కుందుల నాయుడు ఆధీనంలో సాగుతున్న గంజాయి వ్యాపారం ఈ కథకు నేపథ్యం. అక్క‌డే ప‌ని చేసే బావామరదళ్లు దేశీ రాజు (విక్రమ్ ప్రభు), శీలావతి (అనుష్క) ఆ వృత్తిని వదిలి కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటారు. అయితే పరిస్థితులు వారిని తిరిగి అదే దారిలోకి లాగేస్తాయి. అసలు వాళ్లు ఆ వృత్తికి ఎందుకు దూరమయ్యారు? మళ్లీ ఎందుకు ఘాటీల అవతారం ఎత్తారు? అప్ప‌టివ‌ర‌కు శాంతంగా ఉన్న‌ శీలావతి క్రిమినల్‌గా, ఆపై లెజెండ్‌గా ఎలా ఎదిగింది. దాని వెనక ఏం జరిగింది? ఆమె టార్గెట్‌ ఏంటి అన్నది కథ.

Ghaati

తూర్పు కనుమల రస్టిక్ లొకేషన్లు, అనుష్క యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్. అయితే.. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచినా, రెండో భాగంలో పేస్ పడిపోయింది. క్రిష్ నుంచి ఆశించే భావోద్వేగాలు, గూస్‌బంప్స్‌ సన్నివేశాలు మిస్స‌యిన‌ట్లు అనిపిస్తుంది. ఇప్పుడీ ఘాటీ (Ghaati) చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవుతుంది. హింసాత్మ‌క స‌న్నివేశాలు భారీగానే ఉంటాయి.. అనుష్క అంటే ఇష్ట ప‌డే వారు ఈ మూవీ చూడ‌వ‌చ్చు.

Updated Date - Sep 26 , 2025 | 07:31 AM