Junior OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీకి వ‌చ్చిన‌.. కిరిటీ, శ్రీలీల‌ 'జూనియ‌ర్'

ABN , Publish Date - Sep 30 , 2025 | 08:53 AM

రెండున్న‌ర నెల‌ల క్రితం థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకుని యావ‌రేజ్ హిట్‌గా నిలిచిన చిత్రం జూనియ‌ర్.

junior

సుమారు రెండున్న‌రు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకుని యావ‌రేజ్ హిట్‌గా నిలిచిన చిత్రం జూనియ‌ర్ (Junior). క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో ఒకే సారి నిర్మితమైన ఈ మూవీలో గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Kireeti Reddy), శ్రీలీల (Sreeleela) జంట‌గా న‌టించారు. రాధా కృష్ణా రెడ్డి (Radha Krishna Reddy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ (Vaaraahi Chalana Chitram) పై సాయి కొర్ర‌పాటి (Sai Korrapati) నిర్మించగా దేవీశ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) సంగీతం అందించాడు. జెనీలియా, అస్కార్ ర‌విచంద్ర‌న్‌, రావు ర‌మేశ్, హ‌ర్ష చెముడు, స‌త్య‌ కీల‌క పాత్ర‌లు చేశారు. అయితే ఎప్పుడో ఓటీటీకి రావాల్సిన ఈ సినిమా అనేక అవాంత‌రాల‌ను అధిగ‌మించి ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. వ‌య‌సు మ‌ళ్లాక పుట్టిన కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి నిత్యం ఏదో కోల్పోయిన‌ట్లు ఉండ‌డం, కుమారుడు పెద్దై కాలేజీలో స్పూర్తి (శ్రీలీల)ని ఇష్టపడడ‌డం, ఆమె ప‌ని చేసే కంపెనీలోనే జాబ్ సంపాదించుకుంటాడు. ఈ క్ర‌మంలో త‌మ కంపెనీకి త్వ‌ర‌లో సీఈవో కాబోతున్న విజయ సౌజన్య (జెనీలియా)తో వాగ్వాదం, అదే స‌మ‌యంలో త‌న తండ్రి గ‌తం తెలియ‌డం, తండ్రీ కూతుర్ల‌ను క‌లిపేందుకు కుమారుడు ప‌డే తాప‌త్ర‌యం, అందుకు తాను కోల్పోయిందేంటి అనే ఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ మూవీ. ఫ‌స్టాఫ్ అంతా లాగ్ అనిపించినా సెకండాఫ్‌లోనే అస‌లు క‌థ ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్టు షాకిస్తుంది. ఫ‌స్ట్ టైం సినిమా చూసే వారికి క‌న్నీళ్లు తెప్పియ‌క మాన‌దు.

junior

మొదటి భాగం పూర్తిగా కాలేజ్ సన్నివేశాలు, గతంలో ఎన్నో చిత్రాల్లో చూసిన సీన్‌లను రిపీట్ చేసినట్టుగా అనిపించడం వలన కొత్తదనం కనిపించదు. సాంగ్స్, ఫైట్స్ అద్భుతంగా ఉన్నా.. ఎదో వెలితిగా అనిపిస్తుంది. రెండో భాగంలో కిరీటి – జెనీలియా సన్నివేశాలు ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఎనర్జీతో నిండిపోయాయి. శ్రీలీల సినిమా ఫ‌ప‌స్టాప్‌లో మాత్ర‌మే క‌నిపించి సెకండాప్‌లో కేవ‌లం వైర‌ల్ వ‌య్యారి పాటకు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఇక కిరీటి విషయం మాత్రం చెప్పుకోవాల్సిందే. డాన్స్, ఫైట్స్, నటనలో మంచి టాలెంట్ చూపించాడు. తొలి సినిమా అయినప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ జూనియ‌ర్ (Junior) చిత్రం ఆహా (Aha) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, శ్రీలీల ఫ్యాన్స్, ఫ్యామిలీ అడియ‌న్స్‌ చూడొచ్చు.

Updated Date - Sep 30 , 2025 | 10:50 AM