Kaantha OTT: కాంత’ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:40 AM
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్‌లో సందడి చేసింది.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్‌లో సందడి చేసింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు. ఓటీటీ విడుదలపై కొద్దీ రోజులుగా రూమర్స్ వస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ కాంత ఓటీటీ విడుదలపై నెట్‌ఫ్లిక్స్ (Netflix) క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 12 నుంచి ఓటీటీ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది (Kaantha OTT). తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
కథ:
దర్శకుడు అయ్య (సముతిరకని Samuthirakani) అనాథ అయిన టి.కె. మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ను స్టార్ హీరోగా తీర్చిదిద్దుతాడు. అతను తప్పటడులు వేసిన సమయంలో పక్కనే ఉండి మందలిస్తాడు. స్టార్ హీరోగా ఎదిగినా... తనను అయ్య తన చెప్పుచేతల్లో ఉంచుకోవడాన్ని మహదేవన్ సహించలేకపోతాడు. అదే సమయంలో అయ్య తన తల్లి విషాద జీవిత గాథను 'శాంత' పేరుతో తెరకెక్కించాలని చూస్తాడు. కానీ సెట్స్ లో మహదేవన్, అయ్య మధ్య వచ్చిన గొడవల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. మోడ్రన్ స్టూడియోస్ అధినేత వారసుడు చొరవ చూపడంతో ఆగిన 'శాంత' మూవీ మళ్ళీ ఆరేడేళ్ళ తర్వాత సెట్స్ పైకి వస్తుంది. అయితే ఈసారి హీరో మహదేవన్ ఓ కండీషన్ పెడతాడు. తన స్టార్ డమ్ కు తగ్గట్టుగా ఈ సినిమా క్లయిమాక్స్ మార్చాలంటాడు. సినిమా పేరు శాంత కాకుండా 'కాంత'గా పెట్టాలంటాడు. అయ్య కేవలం సెట్స్ మీద ఉంటాడు తప్పితే, సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని మహదేవన్ చెబుతాడు. మూవీ రీ-ఓపెన్ అయిన తర్వాత అయ్య శిష్యురాలైన కుమారి (భాగ్యశ్రీ బోర్సే Bhagyashri Borse) హీరోయిన్ గా ఎంపికవుతుంది. అయ్య, మహదేవన్ మధ్య కుమారి ఎలా నలిగిపోయింది? ఇగోస్ ను పక్కన పెట్టి 'కాంత' సినిమాను అయ్య, మహదేవన్ పూర్తి చేశారా? క్లయిమాక్స్ రోజు జరిగిన హత్యకు కారకులెవరు? పోలీస్ అధికారి ఫీనిక్స్ (రానా దగ్గుబాటి) హంతకులను పట్టుకోలిగాడా? అనేది మిగతా కథ.