House Mates OTT: తమిళ ఫాంటసీ హర్రర్ కామెడీ.. తెలుగులోనూ ఓటీటీకి వచ్చేసింది
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:39 PM
రెండు నెలల క్రితం తమిళనాట థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం హౌస్‌మేట్స్ .
రెండు నెలల క్రితం తమిళనాట థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం హౌస్‌మేట్స్ (House Mates). ఎలాంటి అంచనాలు లేకుండా , ఒకరిద్దరు మినహా పరిచయం లేని నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌తో కుటుంబ ప్రేక్షకులను బాగా అలరించింది. అరుదుగా వచ్చే హర్రర్ సైన్స్ఫిక్షన్,కామెడీ జానర్‌లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇచ్చింది. గత నెలలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సైతం వచ్చిన ఈ సినిమా ఇంకా టాప్‌లోనే ట్రెండింగ్ అవుతూ ఉండడం విశేషం. డిమాంటే కాలనీ చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేసిన టి. రాజా వేల్ (T. Raja Vel) ఈ ఫాంటసీ మూవీకి దర్శకత్వం వహించగా దర్శన్ (Darshan), ఆర్ష చాందిని బైజు (Aarsha Chandini Baiju), కాళీ వెంకట్ (Kaali Venkat), వినోదిని వైద్యనాథన్ (Vinodhini Vaidyanathan) ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. కొత్తగా వివాహం చేసుకున్న కార్తీక్, అను జంట తమ దగ్గర ఉన్న డబ్బుతో ఓ అపార్ట్‌మెంట్‌లో సెకండ్ హ్యండ్ ఫ్లాట్ కొనుగోలు చేసి ఆ ఇంట్లో దిగుతారు. కొన్ని రోజులకు ఆ ఇంట్లో అనుమానాస్పద ఘటనలు జరగడం గమనిస్తుంది. ఇంట్లో వారి ప్రమేయం లేకుంగానే వస్తువులన్నీ వాటికవే ఆన్ ఆఫ్ అవుతుంటాయి. దీంతో గతంలో అక్కడ ఉన్న వారెవరు, ఆ ఇంట్లో ఏమైనా జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో గొడలకు ఉన్న పిల్లల ఫొటోలు మారడం, పెరగడం చూసి షాకవుతారు. ఇంతకు ఆ ఇంట్లో గతంలో ఏం జరిగింది, వింత ఘటనలు ఎందుకు జరిగాయి, ఆ ఇంట్లో మరో ఫ్యామిలీ ఎలా ఉన్నదనే ఓ కొత్త కాన్సెప్ట్‌తో తొలుత చూసే వారికి మంచి థ్రిల్ ఇస్తుంది.
సినిమా ఆరంభం అయ్యాక వచ్చే సన్నివేశాలు చాలా రోటీన్‌గా అనిపించినా సినిమా నడుస్తున్న కొద్ది అసలు విషయాలు రివీల్ అవుతూ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఈ చిత్రం ఇప్పటికే జీ5 (ZEE5) ఓటీటీలో తమిళంలో ఈ హౌస్‌మేట్స్ (House Mates) చిత్రంస్ట్రీమింగ్ అవుతుండగా అల్రెడీ 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. అలాంటి ఈ మూవీని దసరా సందర్భంగా సడన్‌గా తెలుగులోనూ అందుబాటులోకి తీసుకు వచ్చారు. కుటుంబం అంతా కలిసి మంచి మూవీ చూడాలనుకునే వారు, విభిన్న కాన్సెప్ట్ ఇష్ట పడే వారికి ఈ సినిమా బెస్ట్ ఆప్సన్. డోంట్ మిస్ ఇట్.. ఈ సెలవుల్లో పిల్లలతో కలిసి చూసేయండి.