Prabhu deva: 'జాలీ ఓ జింఖానా'  స్ట్రీమింగ్  ఎక్కడంటే.. 

ABN , Publish Date - May 15 , 2025 | 04:28 PM

వినూత్నమైన కథనంతో, ఆసక్తికరమైన పాత్రలతో "జాలీ ఓ జింఖానా"అభిమానులకి పూర్తి ఎంటర్టైన్మెంట్‌ను అందించనుంది.

ప్రభుదేవా (Prabhudeva) హీరోగా శక్తి చిదంబరం (Sakti chidambaram) దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జాలీ ఓ జింఖానా' (Jolly O Gymkhana).  మడోన్నా సెబాస్టియన్ కథానాయిక. అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ కామెడీ మూవీ "జాలీ ఓ జింఖానా" భవానీ మీడియా ద్వారా మే 15 నుంచి ప్రత్యేకంగా ఆహాలో ప్రసారం కానుంది.

వినూత్నమైన కథనంతో, ఆసక్తికరమైన పాత్రలతో "జాలీ ఓ జింఖానా"అభిమానులకి పూర్తి ఎంటర్టైన్మెంట్‌ను అందించనుంది. ఆహాలో ఈ నవ్వుల పండగను మిస్ కాకండి అని ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - May 15 , 2025 | 04:28 PM