A Working Man OTT: సడన్‌గా ఓటీటీకి.. జాసన్ స్టాథమ్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్! తెలుగులోనూ.. ఈయాప్‌లో చూడండి
ABN , Publish Date - May 16 , 2025 | 07:29 AM
Ott ప్రేక్షకులను అలరించేందుకు ఓ హాలీవుడ్ చిత్రం సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేసింది.
ఓటీటీ (Ott) ప్రేక్షకులను అలరించేందుకు ఓ హాలీవుడ్ చిత్రం ఏ వర్కింగ్ మ్యాన్ (A Working Man) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేసింది. గతంలో ట్రైనింగ్ డే, ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ (2001), ఫ్యూరి, సూసైడ్ స్క్వౌడ్ (2016), ది బీ కీపర్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసి భారీ విజయాలను అందించిన డేవిడ్ అయర్ (David Ayer) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. వరల్డ్ ఫేమస్ జాసన్ స్టాథమ్ (Jason Statham) హీరోగా నటించగా జాసన్ ఫ్లెమింగ్ (Jason Flemyng), మైఖేల్ పెనా (Michael Peña), డేవిడ్ హార్బర్ (David Harbour) ఇతర పాత్రల్లో నటించారు.
సుమారు 40 మిలియన్లతో రూపొందిన ఈ చిత్రం మార్చి28న అమెరికా, లండన్ థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ మూవీ 100 మిలియన్ల కలెక్షన్లు రాబట్టి మంచి విజయమే సాధించింది.కథ విషయానికి వస్తే.. హీరో (లెవాన్ కేడ్) కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పనిచేస్తూ ఆ కంపెనీ యజమానితో మంచి రిలేషన్ కలిగి ఉంటాడు. అయితే ఓ రోజు తన బాస్ కూతురిని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. దీంతో తనను కనిపెట్టి తిరిగి తీసుకువచ్చే పనని ఆ కంపెనీ బాస్ హీరోకు అప్పజెబుతాడు. ఆపై హీరో ఏం చేశాడు, అ అమ్మాయిని ఎలా కనిపెట్టాడు, ఇంతకు హీరోకే ఈ పని ఎంత అప్పజెప్పారు, హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటీ, ఆ గ్యాంగ్ ఎవరనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.
అయితే స్టాథమ్ గత అన్ని చిత్రాల మాదిరి సినిమాల మాదిరే ఈ సినిమా ఉంటుంది కానీ కొత్తదనమేమి లేదు. కాకుంటే ఈ సినిమాకు మరో హాలీవుడ్ స్టార్ సిల్వర్‌స్టన్ స్టాలోన్ అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. టెక్నికల్‌గా, మ్యూజిక్ పరంగా కూడా మూవీ అద్భుతంగా ఉంటుంది గానీ జాసన్ స్టార్‌డంను అంతగా ఉపయోగించుకున్నట్లు, ఆయన స్థాయిలో యాక్షన్ ఉన్నట్లు అనిపించదు. ఇప్పుడీ ఏ వర్కింగ్ మ్యాన్ (A Working Man) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (Ott)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. యాక్షన్ సినిమాలు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఇష్టపడే వారు ఒక్కసారి చూడొచ్చు.