Marvel Zombies OTT: ఐరన్ మాన్, కెప్టెన్ మార్వెల్.. జాంబీలుగా మారితే! ఓటీటీకి వ‌చ్చేస్తోంది

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:05 PM

మార్వెల్ అభిమానులకు డిస్నీ ప్లస్‌ మళ్లీ ఓ సర్ప్రైజ్‌ అందించింది.

marvel

మార్వెల్ అభిమానులకు డిస్నీ ప్లస్‌ మళ్లీ ఓ సర్ప్రైజ్‌ అందించింది. గ‌తంలో కార్టూన్‌, యానిమేష‌న్ రూపంలో అల‌రించిన చిత్రాల‌కు జీవం పోస్తూ లైవ్ య‌క్ష‌న్ సినిమాలు రూపొందించిన హాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ తాజాగా మ‌రో కొత్త ప్ర‌య‌త్నానికి న‌డుం బిగించారు. అదే ఇప్ప‌టివ‌ర‌కు సినిమాలుగా వ‌చ్చి మంచి ఆద‌ర‌ణ పొందిన జాంబీ చిత్రాల‌కు రివ‌ర్స‌లో యానిమేష‌న్ రూపం ఇచ్చారు. అంతేకాదు విడుద‌ల‌కు కూడా రెడీ చేశారు.

ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన మార్వెల్ జాంబీస్ (Marvel Zombies) ట్రైల‌ర్ వావ్ అనిపించేలా ఉంది. అద్భుతమైన యాక్షన్‌,చుట్టూ భయం గొల్పే వాతావరణం, కొత్త త‌ర‌హా క‌థ‌నంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. కామిక్‌ పుస్తకాలలోనే కనిపించిన ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌ ఇప్పుడు యానిమేషన్ రూపంలో వచ్చి అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతోంది.

marvel

ఇక ఈ ట్రైలర్ విష‌యానికి వ‌స్తే.. ఒకప్పుడు సూపర్ హీరోలుగా నిలిచిన అవెంజర్స్, ఇప్పుడు భయంకరమైన జాంబీస్‌గా మారిపోవడం. వారి నుంచి సర్వైవ్ కావడానికి కొందరు కొత్త హీరోలు, సర్వైవర్స్ ఎలా పోరాడతారనే కథ నేప‌థ్యంలో ఈ యానిమేటెడ్ సిరీస్‌సాగ‌నుంది. ఈ క్ర‌మంలో థ్రిల్లింగ్ విజువల్స్, డార్క్ టోన్, మరియు టెన్షన్ క్రియేట్ చేసే మ్యూజిక్‌తో ట్రైలర్‌కి గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది.

అంతేగాక.. ముఖ్యంగా “జాంబీ ఐరన్ మాన్, కెప్టెన్ మార్వెల్, స్కార్లెట్ విచ్” లాంటి భయంకర వేరియంట్స్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తారు? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ఇదిలాఉంటే సెప్టెంబ‌ర్ 24 నుంచి జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. చూడాలి మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) వారి ఈ కొత్త ప్ర‌య‌త్నం ఏ మేర ఆద‌రణ పొందుతుందో.

Updated Date - Sep 02 , 2025 | 11:05 PM