Hridayapoorvam: హృదయపూర్వం ఓటీటీలో ఎక్కడంటే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:16 PM
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘హృదయపూర్వం’ ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది.
మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హృదయపూర్వం’ (Hridayapoorvam). సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్ (malavika Mohanan), ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కావడానికి సిద్దమైంది. ‘జియో హాట్‌స్టార్’లో (Jio hotstar) ఈ నెల 26 నుంచి ఈ సినిమా ఓటీటీ వీక్షకుల ముందుకు రానుంది.
కథ:
కొచ్చికి చెందిన సందీప్ బాలకృష్ణన్ (మోహన్‌లాల్) ధనవంతుడు. క్లౌడ్ కిచెన్ ఫ్రాంచైజీలు రన్ చేస్తుంటాడు. హార్ట్ సర్జరీ పూర్తయిన కొంతకాలం తర్వాత ఓ నిశ్చితార్థ వేడుక కోసం పుణె వెళతాడు. ఆ ఎంగేజ్‌మెంట్ మరెవరిదో కాదు.. తనకు గుండె ఇచ్చిన వ్యక్తి కూతురు హరిత (మాళవిక)ది. ఆ సెంటిమెంట్‌తో హరిత కుటుంబానికి సందీప్ దగ్గరవుతాడు. మరోవైపు, వరుడు ఫ్యామిలీ ఊహించిన విధంగా నిశ్చితార్థాన్ని రద్దు చేస్తుంది. అక్కడ స్వల్ప గాయం కావడంతో సందీప్ కొచ్చికి తిరిగి వెళ్లలేక.. హరిత ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సందీప్- హరిత ఒక్కటయ్యారా? మరో వ్యక్తితో హరిత పెళ్లి జరిగిందా? అన్నది ఈ సినిమా కథ.