Mahavatar Narasimha: హోంబలే 'మహావతార్ నరసింహ'.. రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ABN, Publish Date - May 11 , 2025 | 03:34 PM

కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films) కాస్త రూట్ మార్చి నిర్మించిన చిత్రం మహావతార్ న‌ర‌సింహా.

Mahavatar Narasimha

కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films) కాస్త రూట్ మార్చి నిర్మించిన చిత్రం మహావతార్ న‌ర‌సింహా (Mahavatar Narasimha). అయితే ఇది పూర్తిగా యానిమేష‌న్ చిత్రం కావ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టివ‌ర‌కు క్లాస్‌, మాస్ అంటూ భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో సౌత్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న హోంబ‌లే ఫిలింస్ ఇప్పుడు మ‌న స‌నాత‌న‌ హిందూ పురాణ గాథలను 3D రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది.

ఈక్ర‌మంలో మొదటి చాప్టర్‌గా విష్ణు ఉగ్రావతారం నరసింహస్వామి గాథను 'మహావతార్ నరసింహ'గా తెరకెక్కించారు. ఆరు నెల‌ల క్రితం ఈ మూవీ మోషన్ పోస్టర్ వీడియోని రిలీజ్ చేయ‌గా మంచి బ‌జ్ క్రియేట్ చేసింది. ఆడియ‌న్స్‌లో అంచ‌నాలు సైతం క్రియేట్ చేశారు.

అయితే తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తూ తాజాగా మ‌రో వీడియో రిలీజ్ చేశారు. జూలై25 ప్రంపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో మహావతార్ న‌ర‌సింహా (Mahavatar Narasimha)ను రిలీజ్ చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా విడుద‌ల చేసిన గ్లిమ్స్‌ను చూస్తే గూస్‌బ‌మ్స్ వ‌చ్చేలా తీర్చిదిద్దిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Updated Date - May 11 , 2025 | 03:34 PM