Jurassic World Rebirth OTT: ఓటీటీలో.. రూ.7700 కోట్ల సినిమా! ఇప్పుడు.. ఫ్రీగా చూడొచ్చు
ABN , Publish Date - Nov 14 , 2025 | 02:09 PM
ప్రపంచవ్యాప్తంగా 7700 కోట్టు కొల్లగొట్టిన హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఎట్టకేలకు ఫ్రీగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
నాలుగు నెలల క్రితం జూలై మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth). గత చిత్రాల కన్నా నెగిటివ్ రివ్యూలు అధికంగా తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం రచ్చ రంబోలానే సృష్టించింది. సుమారు 225 అమెరికన్ డాలర్లు (రూ.1900 కోట్ల) వ్యయంతో రూపొందిన ఈ సినిమా అంతకు మూడింతలు దాదాపు 869 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7700 కోట్ల)ను కొల్లగొట్టింది.
ఇదిలాఉంటే.. ఈ చిత్రం థియేటర్లకు వచ్చిన నెలలోపే సడన్‌గా రెంట్ పద్దతిలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సైతం వచ్చినప్పటికీ థియేటర్లలో హమా కొనసాగింది. మూవీ రిలీజ్130 రోజులు కావస్తున్నా స్టిల్ ఇప్పటికీ మన దేశంలో, హైదరాబాద్‌లోనూ ఒకటి రెండు థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. అయితే ఇప్పుడీ చిత్రం ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమా థియేటర్లలో మిస్సయ్యామని ఫీలయ్యే వారు, మంచి సర్వైవల్ మూవీ చూడాలనుకునే వారుఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడా ఎలాంటి అసభ్యత, అశ్లీల సన్నివేవాలు ఉండవు, పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా చూడవచ్చు.
కథ ఏంటంటే.. ఓ ఐలాండ్‌లో సజీవంగా ఉన్న డ్రాగన్స్, వాటి గుడ్ల నుంచి తీసిన డీఎన్ఎతో ఖరీదైన, అత్యవసరమైన మందును తక్కువ వ్యయంలో తయారు చేయవచ్చని ఓ బిలియనీర్ ఓ హై సెక్యూరిటీ టీమ్‌తో అక్కడకు వెళతాడు. తాము వచ్చిన పని పూర్తి అవుతున్న సమయంలో ఓ ఆఫీసర్ చేసిన పని వళ్ల సీన్ అంతా రివర్స్ అవుతుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన డైనోసార్లు అక్కడికి వచ్చిన వారి పని పట్టడం స్టార్ట్ చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆ టీమ్ అక్కడి నుంచి సురక్షితంగా బయట పడిందా లేదా ఎలా వాటిని ఎదుర్కొన్నారనేదే జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth) కథ. హాలీవుడ్ టాప్ స్టార్ స్కార్లెట్ జోహన్సన్ (Scarlett Johansson) మెయిన్ లీడ్‌గా నటించడం విశేషం.