Diesel: సడన్‌గా.. తెలుగులో ఓటీటీకి వచ్చేసింది
ABN , Publish Date - Nov 19 , 2025 | 08:04 AM
ఉన్నఫలంగా ఓ తమిళ హిట్ చిత్రం డిజీల్ (Diesel) సడన్‌గా తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది.
కాస్త విరామం తర్వాత.. ఉన్నఫలంగా ఓ తమిళ హిట్ చిత్రం డిజీల్ (Diesel) సడన్‌గా తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది. గతనెల 17న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించింది. గతంలో పార్కింగ్ సినిమాతో ఆకట్టుకున్న హరీశ్ కల్యాణ్ (Harish Kalyan) హీరోగా నటించగా అతుల్య రవి (Athulya Ravi) కథానాయికగా చేసింది. మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Sai Kumar), వినయ్ రాయ్ (Vinay Rai) కీలక పాత్రల్లో నటించారు. షణ్ముగం ముత్తుస్వామి ( Shanmugam Muthusamy) దర్శకత్వం వహించాడు.
కథ విషయానికి వస్తే.. చైన్నైలోని సముద్రతీరంలో ఏర్పాటు చేసిన క్రూడాయిల్ పైపులైన్ వళ్ల అక్కడి వారికి జీవనోఫాది లేకుండా పోతుంది. ఎదురుతిరిగిన వారిని చంపేస్తారు. అయితే.. కొన్నాళ్లకు మనోహర్ అనే వ్యక్తి అక్కడి వాళ్ల సమస్యలు తీర్చాలని ఆ పైపులైను నుంచి అయిల్‌ను తస్కరించి ముంబయ్‌కు సప్తై చేసి అక్కడ దానిని డీజిల్, పెట్రోల్‌గా మార్చి తిరిగి తమ రాష్ట్రానికే తీసుకువచ్చి బంకులకు సప్లై చేస్తుంటారు. అదే సమయంలో వాసు (డిజీల్) అనే వ్యక్తిని పెంచుకుంటూ కుమారుడిగా చూసుకుంటూ ఉంటాడు.

అయితే.. వీరి బిజినెస్‌పై కన్నేసిన బాల మురుగన్ అనే వ్యక్తి స్థానిక డీసీపీ సాయంతో కలిసి మనోహర్ గ్యాంగ్ సప్లై చేస్తున్న పెట్రోల్‌ను కల్తీ చేసి వారికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తుంటాడు. అంతేగాక మనోహర్‌ను అడ్డు తొలగించుకుని ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకు రావాలని ఫ్లాన్ చేస్తారు. ఈ నేపథ్యంలో హీరో వాసు వారిని ఎలా అడ్డుకున్నాడు. డీసీపీ చివరకు ఏం చేశాడు అనే ఆసక్తికరమైన పాయింట్‌తో మూవీ సాగుతుంది.
ఇదిలాఉంటే.. సినిమా నేపథ్యం, క్రూడాయిల్, పెట్రోల్ కల్తీ చేసే విధానం, దాని వెనక జరిగే కుట్రలు ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లాగా సినిమా సాగిన రోటిన్ స్ట్రీన్ ప్లే, ఏం జరుగబోతుందనేది ముందు తెలియడం ఈ చిత్రానికి కాస్త మైనస్. ఇప్పుడీ సినిమా సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ (OTT)లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మాస్, రస్టిక్, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు ఓ మారు చూసేయవచ్చు.