Final Destination 6 OTT: 5 నెలల తర్వాత ఆ ఓటీటీకి.. ఇప్పుడు ఫ్రీగా తెలుగులోనూ చూడొచ్చు!
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:24 AM
ఐదు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన హాలీవుడ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్.
ఐదు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన హాలీవుడ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ (Final Destination: Blood lines) . పద్నాలుగేండ్ల విరామం తర్వాత సీక్వెల్‌గా మే 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించి మేకర్స్‌ను సైతం ఆశ్చర్య పరిచింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 320 మిలియన్ల డాలర్ల (రూ. 2620 కోట్ల) కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దుమ్మును దులిపింది.ఈ సిరీస్‌లో గతంలో వచ్చిన ఐదు చిత్రాలను మించి వయొలెన్స్, థ్రిలింగ్ ఎలిమెంట్స్ తో అంతకుమించి అనేలా సినిమాను రూపొందించారు.
కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, ఆ ప్రమాదం నుంచి బయట పడుతుంది ఐరిస్. తర్వాత ఆమెకు పిల్లలు పుట్టడం తర్వాత మనుమలు మనుమరాండ్లు కూడా వచ్చేస్తారు. అయితే విధి ప్రకారం ఏనాడో చనిపోవాల్సిన ఐరీస్ బతికుండడంతో మరణం ఆమె కుటుంబాన్నివెంటాడుతూనే ఉంటుంది. అయితే ఐరీస్ తను చదివిన పుస్తకాలు, తెలిసిన మతాచారాలను అన్నింటినీ అంచనా వేసి ఓ బుక్ రాసి మరణం వారి ఫ్యామిలీ దరి చేరకుండా ఊరికి, కుటుంబానికి దూరంగా పకడ్బందీగా ఏర్పాట చేసిన ఇంట్లో ఉంటుంది.
అయితే.. ఐరీస్‌లాగే సిక్స్ సెన్స్ పవర్ మనుమరాలికి కూడా వస్తుంది. ఓ రోజు కాలేజీలో ఉండగా తమ ఫ్యామిలీకి ఏదో జరగబోతున్నట్లు తెలిసి తన ఆ ఊరికి వచ్చి మధ్యలో నానమ్మను చూడడానికి ఇంటికి వెళుతుంది. అక్కడ జరిగిన పొరపాటు వల్ల నానమ్మ కనుల ముందే చనిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ ఫ్యామిలీలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ కుటుంబం బలైందా, బతికిందా, మనుమరాలు ఏం చేసిందనే ఓళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో సీటు ఎడ్జ్‌లో కూర్చోబెటల్లే సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకున్నా అక్కడ జరిగే కొన్ని మరణాలు ఒంటిని జలదరింప జేస్తాయి. మన ప్రమేయం లేకుండానే ఎక్కడో వెంటుక్ర వాసిలో జరిగిన చిన్న పొరపాటుతో హఠాత్తుగా ఇక్కడ ఉన్న మనిషికి మరణం సంభవించి చూసే వారి కండ్లు బైర్లు కమ్మేలా సన్నివేశాలు ఉంటాయి.
ఆయితే మూడు నెలల క్రితమే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చినప్పటికీ కేవలం రెంట్ పద్దతిలో మాత్రమే అంఉబాటులో ఉండేది. దీంతో చాలా మంది డబ్బులు కట్టి సినిమా చూడలేక థర్డ్ పార్టీ సైట్లను ఆశ్రయించారు. తీరా ఇన్నాళ్లుకు ఇప్పుడు జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లో అందరూ ఉచితంగా చూసేలా అందుబాటులోకి తీసుకు వచ్చారు. హాలీవుడ్ సినిమాలు తెగ ఇష్ట పడే వారు ముఖ్యంగా ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ లవర్స్, హింసాత్మక, థ్రిల్, స్లాషర్ సినిమాలు ఇష్టపడే వారికి తప్పక చూడాల్సిన మూవీ ఇది. ఇప్పటికే చూసిన వారు మరోసారి ఇంట్లోనే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ (Final Destination: Blood lines) చూసేయవచ్చు. అయితే.. కొత్తగా చూడాలనుకునే వారు, హార్ట్ పేషంట్లు, ఆ సన్నివేశాలను చూసి తట్టుకోగలిగిన వారే కాస్త ధైర్యం చేయడం ఉత్తమం..