Aparadhi OTT: నాలుగేళ్ల తర్వాత.. తెలుగులో ఓటీటీకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్
ABN , Publish Date - May 06 , 2025 | 09:33 PM
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ మలయాళ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ చిత్రం నాలుగేళ్ల తర్వాత తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది.
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ మలయాళ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ చిత్రం నాలుగేళ్ల తర్వాత తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. అగ్ర నటులు ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil), షౌబిన్ షాహిర్ (Soubin Shahir), దర్శణ రాజేంద్రన్ (Darshana Rajendran) కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ (Naseef Yusuf Izuddin) దర్శకత్వం వహించాడు. 2021 ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిశ్ర స్పందనను దక్కించుకుంది.
కథ విషయానికి వస్తే.. అలెక్స్ అనే రైటర్, అర్చన అనే లాయర్ మూడు నాలుగు నెలలుగా ప్రేమలో ఉంటారు. సడన్‌గా ఓ రోజు లాంగ్ ట్రిప్ ఫ్లాన్ చేసుకుని బయలు దేరుతారు. ఆ ప్రయాణంలో వారికో ఓ కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు అనుకోకుండా ఓ మర్డర్ చేయబడిన మృతదేహం వారి కథలోకి వస్తుంది. అంతే కాదు అలెక్స్ తన నవలలో రాసిన విధంగా అక్కడ సంఘటనలు జరుగుతుంటాయి. దాంతో ఆ మీస్టరీ నేపథ్యంలో ముగ్గురి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంది.
ఎలాంటి పాటలు లేకుండా ఒకే ఇంట్లో మూడు పాత్రల చుట్టే తిరిగే ఈ మూవీ నిడివి కేవలం 90 నిమిషాలు మాత్రమే. సినిమాలో మూడు క్యారెక్టర్లే అయినప్పటికీ చివరి వరకు అదిరి పోయే థ్రిల్‌ను ఇస్తుంది. ఫస్టాప్ కాస్త స్టోగా అనిపించినా అదిరిపోయే ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చి మూవీ చివరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండగా ఇప్పుడు తెలుగులో అహా (Aha) ఓటీటీలో మే8 గురువారం నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారు. డిఫరెంట్ సినిమా చూడాలనుకునే వారు ఓ మారు ఈ సినిమాను చూసేయవచ్చు.