Thudarum: ఓటీటీకి వ‌చ్చేసిన‌.. అదిరిపోయే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌! అస‌లు వ‌ద‌ల‌కండి

ABN , Publish Date - May 30 , 2025 | 07:01 AM

గ‌త నెల ఏప్రిల్ చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మ‌ల‌యాళ‌, తెలుగు భాష‌ల్లో బాక్సాపీస్‌ను కొల్ల‌గొట్టిన చిత్రం తుడ‌రుమ్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

గ‌త నెల ఏప్రిల్ చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మ‌ల‌యాళ‌, తెలుగు భాష‌ల్లో బాక్సాపీస్‌ను కొల్ల‌గొట్టిన చిత్రం తుడ‌రుమ్ (Thudarum). సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి నెల దాటినా ద‌క్షిణాదిన‌ అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతూ సినీ పండితులను ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. 38 యేడ్ల త‌ర్వాత మోహ‌న్‌లాల్ (Mohanlal), శోభ‌న (Shobana) జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.250 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి కేర‌ళ‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. అయితే.. జూన్ మొద‌టి, రెండో వారంలో గానీ ఓటీటీకి రానున్న‌ట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం ఇప్పుడీ సినిమా శుక్ర‌వారం (మే 30) నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రంలో కీల‌క‌ పాత్ర‌ల్లో ప్ర‌కాశ్ వ‌ర్మ (Prakash Varma), బినూ ప‌ప్పు (Binu Pappu) న‌టించ‌గా సినిమాకు త‌రుణ్ మూర్తి (Tharun Moorthy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. టాక్సీ డ్రైవర్ షణ్ముఖం (మోహన్ లాల్). అంతా బెంజ్ అని పిలుస్తుంటారు. భార్య లలిత, కొడుకు, కూతురులతో హ్యాపీగా జీవితాన్ని గడుపు తుంటాడు. త‌న‌కు కుటుంబంతో పాటు త‌న గురువు బ‌హుమ‌తిగా ఇచ్చిన పాత అంబాసిడర్ కారంటే ప్రాణం. ఓ రోజు కుమారుడు త‌న తండ్రి బెంజ్‌కు తెలియ‌కుండా స్నేహితుల‌తో క‌లిసి కారు బ‌య‌ట‌కు తీయ‌గా అనుకోకుండా చిన్న ప్ర‌మాదానికి గ‌ర‌వ‌డంతో కారును మెకానికిక్ ఇవ్వాల్సి వ‌స్తుంది. దాంతో బెంజ్ కొడుకుపై ఆగ్ర‌హంతో చేయి చేసుకోవ‌డంతో అలిగి ఇంటి నుంచి వెల్లి పోతాడు. అదే స‌మ‌యంలో కారులో గంజాయి దొరికిందంటూ అక్క‌డి పోలీసులు ఆ కారును సీజ్ చేస్తారు. కారును తిరిగివ్వ‌డానికి పోలీసులు బాగా తిప్పించుకుంటారు. చివ‌ర‌కు త‌మ‌కు ఓ పని చేసి పెట్టి కారు తీసుకెళ్లొచ్చని చెబుతారు. దాంతో బెంజ్ అయిష్టంగానే వారి పని పూర్తి చేసి కారుతో ఇంటికి వ‌స్తాడు.

lal.jpg

ఇదిలాఉంటే.. ఇంటి నుంచి అలిగి వెళ్లిన కుమారుడు ఎంత‌కు ఇంటికి రాక‌పోడంతో బెంజ్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెడ‌తాడు. పోలీసుల‌పై న‌మ్మ‌కం లేక బెంజ్ త‌న కొడుకు గురించి ఆరా తీస్తుండ‌గా ఊహించని విషయాలు బయట పడతుంటాయి. ఈ నేప‌థ్యంలో బెంజ్‌కు కుమారుడి ఆచూకీ ల‌భించిందా, పోలీసుల‌కు అత‌ను చేసిన ప‌ని వెన‌కాల మిస్ట‌రీ ఏంటీ, అస‌లు పోలీసులు బెంజ్ ను ఎందుకు టార్గెట్ చేశారు? స‌డ‌న్‌గా వ‌చ్చే విజ‌య్ సేతుప‌తికి బెంజ్‌కు ఉన్న లింకేంటి, చివ‌ర‌కు సినిమా ఎలా ముగుస్తుందనే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్‌ క‌థ‌నంతో సినిమా సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌ను ఆ సినిమాలో లీన‌మ‌యేలా చేస్తుంది.

ఆరంభంలో కాసేపు పుల్ ఫ్యామిలీ రిలేష‌న్స్ పై న‌డిచిన సినిమా ఒక్క సారిగా ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతూ మ‌న‌ల్ని సీటులో కూర్చోనియ‌కుండా చేస్తుంది. అస‌మ‌యంలో వ‌చ్చే పాట‌, బెంజ్ త‌న పాత జ్ఞ‌ప‌కాలు గుర్తు చేసుకోవ‌డం, త‌న గురువుతో ఉన్న బాండింగ్‌ వంటి ఎమోష‌న్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో మిస్స‌య్యారో, మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ చూడానుకునే వారు ఈ తుడ‌రుమ్ (Thudarum) సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్ అవ‌కుండా చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు మంచి, అదిరిపోయే సినిమా చూశామ‌నే సంతృప్తి కూడా మిగులుతుంది.

Updated Date - May 30 , 2025 | 07:01 AM