Dominic And The Ladies Purse: ఎట్టకేలకు ఓటీటీకి.. మమ్ముట్టి సినిమా
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:00 PM
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ రూపొందించిన చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. ఇన్నాళ్లకు ఓటీటీలోకి రానుంది
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ రూపొందించిన చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic and the Ladies' Purse). మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి నెలలో విడుదలైంది. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5 వేదికగా డిసెంబర్ 19 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెబుతూ జీ5 పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్‌గా నటించారు.
కథ :
మాజీ పోలీస్ అధికారి అయిన డొమినిక్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌గా మారతారు. ఒక సందర్భంలో లేడీస్ పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిది? అప్పటికే అదృశ్యమైన పూజ అనే అమ్మాయితో ఈ పర్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? పూజాను ఎవరు హత్య చేశారు? ఆమె బాయ్‌ఫ్రెండ్ కార్తిక్ ఏమయ్యాడు? అన్నది సింపుల్ గా కథ.