Bison OTT: అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా.. ఓటీటీకి వచ్చేసింది! డోంట్ మిస్
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:13 AM
చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ నటించిన బైసన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో తమిళ నాట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ (Dhruv Vikram). ఆ తర్వాత మహాన్ అనే సినిమా చేసిన మీరో మళ్లీ ఇన్నాళ్లకు దాదాపు ఐదేండ్ల సమయం వెచ్చించి మరి చేసిన చిత్రం ‘బైసన్’(Bison). సెన్సిబుల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్, రాజీషా విజయన్ కథనాయికలుగా నటించారు. కబడ్డీ నేపథ్యంలో.. 1993లో జపాన్‌లో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ లో పాకిస్తాన్ పై ఇండియాను గెలిపించిన మనతి పి. గణేశన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమాను వారం తర్వాత అదే పేరుతో తెలుగులోనూ ధియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ప్రచార లోపం వళ్ల జనాలకు చేర లేకపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్టీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో కబడ్డీ అంటే ప్రజలకు పిచ్చి. కానీ కులం, రాజకీయాలు, వ్యక్తిగత పగ వంటి కారణాల వల్ల అసలు ప్రతిభ బయటపడదు. అదే పరిస్థితి వనతి కిట్టయ్య (ధృవ్ విక్రమ్)కు ఎదురవుతుంది. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం. కానీ తండ్రి వేలుస్వామి (పశుపతి) గతంలో ఎదురైన చేదు సంఘటనల వల్ల కబడ్డీ ఆటకు తన కుమారుడిని దూరంగా ఉంచుతాడు. తండ్రి అడ్డుకున్నా.. అక్క (రజీషా విజయన్)తో కలిసి కిట్టయ్య తన కలను కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ గ్రామ రాజకీయాలు, కుల వివక్ష, ఫేవరిటిజం కారణంగా స్థానిక టీముల్లో కూడా స్థానం దక్కదు. ఈ సమయంలో పీఈటీ మాస్టర్ (మదన్ కుమార్) అతని ప్రతిభను గుర్తించి స్కూల్ టీమ్‌లో చేర్చుతాడు. అక్కడ ప్రారంభమైన కిట్టయ్య జర్నీ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. 1993 జపాన్ ఏషియన్ గేమ్స్‌లో పాకిస్తాన్‌పై ఇండియాను గెలిపించిన కబడ్డీ ఆటగాడు మనతి పి. గణేశన్ జీవితం ఆధారంగా ఈ కథ నడుస్తుంది.
ఒక రా అండ్ రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామా బ్యక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో పాత్రల భావోద్వేగాలు, సామాజిక అంశాలు, కబడ్డీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ధృవ్ విక్రమ్ నటన మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. కబడ్డీ ఆటగాడిగా కనిపించేందుకు ధృవ్ రెండున్నర సంవత్సరాలు ఓ గ్రామంలో ఉండి కఠిన శిక్షణ తీసుకోవడం విశేషం.. ఇక అనుక్షణం కొడుకుని కాపాడుకునేందుకు ఆరాటపడే తండ్రిగా పశుపతి అద్భుతంగా చేశాడు. ఆయన పాత్రే సినిమాకు బలమైన ఎమోషనల్ పిల్లర్. అక్కడక్కడ కాస్త లాగ్, రోటీన్ అనిపించినా చూసే వారికి మంచి ఫీల్ ఇచ్చే మస్ట్ వాచ్ మూవీ ఇది.కబడ్డీ, రియలిస్టిక్ సినిమాలు, మారి సెల్వరాజ్ స్టైల్ నచ్చేవారికి తప్పక నచ్చే సినిమా. ‘బైసన్’ . మనోడు కాదన్న వాడైతే ఒకటే ప్రమాదం.. మనవాడే కాదన్నప్పుడు మాత్రం అంతకు మించి ప్రమాదం అనే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.