Idli Kottu OTT: ధ‌నుష్‌.. ఇడ్లీకొట్టు ఓటీటీకి వ‌చ్చేసింది.

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:09 AM

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, నిత్యామీనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’ ఇప్పుడు థియేటర్ల తర్వాత డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

Idli Kottu

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush), నిత్యామీనన్‌ (Nithya Menen) జంటగా నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu) ఇప్పుడు థియేటర్ల తర్వాత డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆయన నాలుగో డైరెక్టోరియల్‌ వెంచర్‌. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు కూడా. ‘తిరు’ (Thiru) తర్వాత ధనుష్‌, నిత్యామీనన్‌ మరోసారి జోడీగా కనిపించిన ఈ ఫ్యామిలీ డ్రామా దసరా కానుకగా అక్టోబర్‌ 1న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే: శివకేశవులు (రాజ్‌ కిరణ్‌) సొంత ఊరైన శంకరాపురంలో ‘ఇడ్లీ కొట్టు’ అనే చిన్న హోటల్‌ నడుపుతుంటాడు. తండ్రి కలలను కొనసాగించాలని కొడుకు మురళీ (ధనుష్‌), హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం పొందుతాడు. బ్యాంకాక్‌లో పని చేసే సమయంలో కంపెనీ అధినేత (సత్యరాజ్‌) కూతురు మీరా (షాలినీ పాండే)తో ప్రేమలో పడతాడు. పెళ్లి ఏర్పాట్లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మధ్యలో తండ్రి ఆకస్మిక మరణంతో ఇండియాకు తిరిగి వస్తాడు. ఆ తర్వాత మురళీ జీవితంలో ఏ మార్పులు జరిగాయి? తండ్రి కలలను నెరవేర్చేందుకు అతను తీసుకున్న నిర్ణయమే సినిమా సారాంశం.

Idli Kottu

ధనుష్‌ ఈ సినిమాలో తనకు అల‌వాటైన సొంత శైలిలో కుటుంబ బంధాలు, భావోద్వేగాల‌ను అద్భుతంగా చూపించాడు. నిత్యామీనన్‌ పాత్ర కథకు హృదయం లాంటిది. సత్యరాజ్‌, సముద్ర‌ఖని, అరుణ్‌ విజయ్‌ వంటి నటులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పిస్తారు. ఇప్పుడ ఈ సినిమా‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu) నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో తమిళం, తెలుగు, హిందీ సహా అనేక భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

థియేటర్‌లో మిస్సైన వాళ్లందరికీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఫ్యామిలీతో కూర్చొని చూసేయ‌వ‌చ్చు. సంగీతం ఆక‌ట్టుకుంటుంది. నిత్యా మీన‌న్ ఎంట్రీ ఆల‌స్యమైన త‌న స్టైల్ యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతుంది. త‌మిళంలో ఇడ్లీ క‌డైగా వ‌చ్చిన ఈ సినిమా త‌మిళ నాట మంచి విజ‌యం సాధిచింది. తెలుగులో అంత‌గా ప్ర‌చారం లేక పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ప్ర‌జ‌ల‌కు రీచ్ కాలేక పోయింది

Updated Date - Oct 29 , 2025 | 06:09 AM