Ritu Varma: ‘దేవిక & డానీ’కి మంచి స్పందనే వచ్చింది
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:58 PM
రీతూ వర్మ, సూర్యవశిష్ఠ, శివ కందుకూరి కీలక పాత్రధారులుగా ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రీతూ వర్మ, సూర్యవశిష్ఠ, శివ కందుకూరి కీలక పాత్రధారులుగా ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రీతువర్మకి ఓటిటి డెబ్యూ ఇది. ఇందులో పల్లెటూరిఅమ్మాయిగా, సమస్య వస్తే ఎదిరించే అమ్మాయిగా ఆ క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సూర్య వశిష్ఠ, శివ కందుకూరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని మెచ్చుకుంటున్నారు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు. డైరెక్టర్ కిషోర్.బి ఈ సిరీస్ ను ఆసక్తికరంగా మలిచారని వీక్షకులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ మంచి రేటింగ్‌తో నడుస్తోందని నిర్వాహకులు తెలిపారు