Mayasabha: దర్శకుడు దేవా కట్టా నాయుడు వైపా... రెడ్డి వైపా..
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:19 AM
దర్శకుడు దేవా కట్టా (Devakatta) క్రియేటర్‌గా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'మయసభ' (Mayasabha). ఆగస్టు 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ (sonylive) కానుంది.
దర్శకుడు దేవా కట్టా (Devakatta) క్రియేటర్‌గా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'మయసభ' (Mayasabha). ఆగస్టు 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ (sonylive) కానుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక, ఇది రాజకీయ, కులపరమైన భావోద్వేగాలను రేకెత్తించబోతుందన్న చర్చలు తెరపైకి వచ్చాయి.
ఆది పినిశెట్టి 'నాయుడు' పాత్రలో, చైతన్య రావ్ 'రెడ్డి' పాత్రలో కనిపించనున్న ఈ కథ, రెండువర్గాల మధ్య ఉండే శక్తి సమీకరణలను ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. దేవా కట్టా గతంలో తీసిన ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ సినిమాల్లో కూడా ఆయన సామాజిక మరియు రాజకీయ అంశాలపై గళం విప్పిన సందర్భాలు ఉన్నాయి. అందువల్లే, ఈ సిరీస్ ఓ వర్గాన్ని గ్లామరైజ్ చేసి, మరొక వర్గాన్ని విమర్శిస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది దేవా కట్టా కులపరంగా ఒక వర్గానికి ఆనుకూలంగా ఉంటారని అభిప్రాయపడుతుండగా, మరికొంతమంది ఆయన వాస్తవాలను నిర్భయంగా చెప్పేవారని విశ్వసిస్తున్నారు. స్వయంగా దేవా కట్టా మాత్రం, 'ఇది ఒక కుటుంబ కథ. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం లేదు' అని స్పష్టం గా చెప్పారు. 'మయసభ' సిరీస్‌కి సంబంధించిన చర్చలు ఇప్పటికే రాజకీయ, సామాజిక వర్గాల్లో వేడెక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇద్దరు నాయకులకు సంబంధించి వచ్చిన ఏ కథ అయినా వన్ సైడ్ గానే చెప్పారన్న టాక్ ఉంది. మరి దేవాకట్ట చేసిన మయసభ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సిరీస్ ఆగస్టు 7 ప్రసారం తర్వాత మరిన్ని అనుభూతుల తాకిడి తప్పదన్నది ఖాయం.