DDNextLevel: ఓటీటీలోకి హారర్ కామెడీ.. ఎప్పుడంటే
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:19 PM
సంతానం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level). సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సంతానం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level). సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి హర్రర్ కామెడీ తో ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో వేదికగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
కథ:
కృష్టమూర్తి (సంతానం) ఓ యూట్యూబ్ ఛానల్
నిర్వహిస్తుంటారు. అందులో నిజాయతీగా సినిమాల రివ్యూలు ఇస్తూ అందరి ప్రశంసలు అందుకుంటాడు. ఒకసారి ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరుకావాలని కృష్టమూర్తికి ప్రత్యేక ఆహ్వానం వస్తుంది. దీంతో కుటుంబంతో కలిసి ఆ సినిమా చూడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక అది దెయ్యాల థియేటర్ అని తెలుస్తుంది. అక్కడికి వెళ్తే బయటకు రావడం అసాధ్యమని తెలుసుకుంటాడు. ఒకప్పుడు తాను రివ్యూ ఇచ్చిన సినిమా నిర్మాత తనపై పగ తీర్చుకోవడానికే ఇలా చేశాడని తెలుసుకుంటాడు. దీంతో ఆ థియేటర్ నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు.. అసలు అందులో దెయ్యాలు ఉన్నాయా.. అనేది కథ.