Mufti Police OTT: ఒకేసారి రెండు.. ఓటీటీల్లోకి లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:57 AM
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నటించగా నవంబర్21న థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన తమిళ చిత్రం మఫ్టీ పోలీస్.
సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నటించగా నవంబర్21న థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన తమిళ చిత్రం మఫ్టీ పోలీస్ (Mufti Police). ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), రామ్ కుమార్ గణేశన్, ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, వేల రామ్మూర్తి, ఫ్రాంక్‌స్టార్ రాహుల్ కీలక పాత్రల్లో నటించారు. దినేశ్ లక్షణన్ (Dinesh Lakshmanan) రచించి, దర్శకత్వం చేశాడు. కాగా ఈ మూవీ సడన్‌గా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి సర్‌ఫ్రైజ్ చేసింది.
కథ విషయానికి వస్తే.. ఓ ప్రముఖ రచయిత జెబా ఓ అర్థరాత్రి కారులో వెళుతూ అనుహ్యంగా ప్రమాదానికి, ఆపై హత్యకు గురవుతాడు. దాంతో ఈ కేసును చేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. మరోవైపు ఆటిజం స్కూల్‌లో పిల్లలకు టీచింగ్ చేసే మీరా, అతని ప్రియుడికి ఈ హత్యతో ఉన్న లింకేంటి, హీరో కేసును ఎలా చేధించాడు, ఇంతకు హత్య చేసింది ఎవరనేదే కథ.

అయితే.. ఇప్పటివరకు చూసిన తరహా కాన్సెప్ట్ అయినప్పటికీ కొత్త తరహాలో సినిమాను ప్రజంట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఫస్టాప్ కాస్త స్టోగా సాగినా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టు, ఆటిజం చిన్నారి స్టోరీ గుండెలను బరువెక్కిస్తాయి. పాటలు వినసొంపుగా లేక ఇబ్బంది పెడతాయి. ఇప్పుడీ సినిమా ఆహా (aha), సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలలో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. థియేటర్‌లో మిస్సయిన వారు, అర్జున్ ఫ్యాన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఇష్టపడే వారు ఈ మఫ్టీ పోలీస్ (Mufti Police) చిత్రాన్ని ఒకమారు ట్రై చేయవచ్చు.